Indian Railways: భారతీయ రైల్వే మే1, 2025 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తోంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉన్న వారిని స్లీపర్ తో పాటు ఏసీ కోచ్ లలోకి అనుమతించడం లేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు కన్ఫర్మ్ కాని టికెట్లు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ అందించబడుతుందని తెలిపారు. ఆఫ్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి క్యాన్సిల్ చేసుకోవాలని సూచించారు.
2 టికెట్లు కన్ఫార్మ్, మరో 2 వెయిట్ లిస్ట్..
కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ ప్రకారం.. కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వెయిట్ లిస్ట్ టికెట్స్ ఉన్న మిగిలిన వ్యక్తులు స్లీపర్ క్లాస్ లో లేదంట ఏసీ కోచ్ లలో ప్రయాణించడానికి అనుమతించబడరు. ఈ నిబంధనను పాటించకపోతే రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 155 ప్రకారం టీటీఈ పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
టికెట్ కన్ఫార్మ్ కాని వాళ్లు ఏం చేయాలంటే?
మీ ఫ్యామిలీలో సగం మందికి టికెట్ కన్ఫార్మ్ అయి, మరో సగం మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయానికి వెయిట్ లిస్టు టికెట్లు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతాయి. ఈ నేపథ్యంలో వెయిట్ లిస్ట్ టికెట్ ఉన్న వాళ్లు కచ్చితంగా ప్రయాణం చేయాలనుకుంటే.. తప్పనిసరిగా కొత్త అన్ రిజర్వ్డ్ (జనరల్) క్లాస్ టికెట్‌ను కొనుగోలు చేయాలి. ఇవి స్టేషన్ కౌంటర్లలో లేదంటే UTS మొబైల్ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా జనరల్ కంపార్ట్‌మెంట్‌ల లోకి వెళ్లడం అనధికారిక ప్రయాణంగా భావిస్తారు.
Read Also: ట్రావెల్ ఏజెంట్లలో జాగ్రత్త, ఆ టికెట్స్ మిస్ యూజ్ కావద్దంటూ ఇండియన్ రైల్వే వార్నింగ్!
కన్ఫర్మ్ టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కితే?
కొత్త నిబంధనల ప్రకారం.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులు రిజర్వ్ చేయబడిన కోచ్ లలో కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం లేదు. ఎవరైనా ప్రయాణీకుడు చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే స్లీపర్ కోచ్‌కు రూ. 250, AC కోచ్‌కు రూ. 440 జరిమానా విధించబడుతుంది. అదనంగా, బోర్డింగ్ పాయింట్ నుంచి తదుపరి స్టేషన్‌కు ప్రయాణీకుడికి ఛార్జీ కూడా వసూలు చేయబడుతుంది. అంతేకాదు, కోచ్ నుంచి కిందికి దించడం లేదంటే జనర్ కోచ్ లోకి పంపిస్తారు. కొన్నిసార్లు రైల్లో నుంచి బయటకు దింపే అవకాశం కూడా ఉంటుంది. సదరు ప్రయాణీకుడు చెప్పే కారణం సహేతుకంగా లేకపోతే, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే పరిస్థితి ఉంటుంది.
Read Also: మిడిల్ బెర్త్ విరిగి ప్రయాణీకురాలికి తీవ్ర గాయాలు, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయని రైల్వే అధికారులు!