BigTV English

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు… దృశ్యం సినిమాకి మించిన సస్పెన్స్

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు… దృశ్యం సినిమాకి మించిన సస్పెన్స్

OTT Movie : మలయాళం సినిమాలంటే మొదటగా స్టార్ హీరో మోహన్ లాల్ గుర్తుకు వస్తాడు. టాలీవుడ్ లో కూడా ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన ‘దృశ్యం’లాంటి కొన్ని ఐకానిక్ సినిమాలైతే ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హీరో అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకుంటాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (Jio hot star) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తుడరమ్’ (Thuduram). 2025లో విడుదలైన ఈ మలయాళం మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. K. R. సునీల్‌ దీనికి స్క్రీన్‌ప్లే వ్రాసాడు. రేజపుత్ర విజువల్ మీడియా ద్వారా ఎం. రెంజిత్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రలు పోషించగా, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాసిల్, మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు, థామస్ మాథ్యూ, కృష్ణ ప్రభ సహాయక పాత్రల్లో నటించారు.


‘తుడరమ్’ 2025 ఏప్రిల్ 25 న థియేట్రికల్‌ గా రిలీజ్ అయ్యి, బ్లాక్‌ బస్టర్‌ హిట్ టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా రికార్డ్ కూడా సాధించింది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

స్టోరీలోకి వెళితే

షణ్ముగం (మోహన్‌లాల్) ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతను తన పాత అంబాసిడర్ కారును అమితంగా ప్రేమిస్తాడు. గతంలో స్టంట్‌ మ్యాన్‌గా పని చేసిన అతను, ఇప్పుడు తన భార్య, పిల్లలతో కలిసి ఓ గ్రామంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ఒక ఊహించని సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది.

అతని కారును మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించడంతో… హీరో ఒక పెద్ద కుట్రలో చిక్కుకుంటాడు. ఈ కుట్రలో అవినీతిపరులైన పోలీసులు, నేరస్థులు ఉంటారు. ఇప్పుడు షణ్ముగం తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఒక హత్య కేసును కూడా అతను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read Also : మందు కోసం పంచాయతీ… ఈ తాగుబోతుల కామెడీకి కడుపు చెక్కలే

ఈ క్రమంలో తనను ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళపై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఒక పక్క ఫ్యామిలీని కాపాడుకుంటూ, మరోవైపు తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. చివరికి షణ్ముగం నిర్ధోషిగా బయటపడతాడా ? అతని ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కుంటుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×