OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు డిఫరెంట్ కథలతో నిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దృశ్యం సినిమాతో మొదలైన విజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఆది గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శక్తిపీఠాన్ని కాపాడే ప్రయత్నంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తియాన్’ (Tiyaan). 2017 లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, మురళీ గోపీ, సూరజ్ వెంజరమూడు, అనన్య, పారిస్ లక్ష్మి, రాహుల్ మాధవ్, షైన్ టామ్ చాకో, పద్మప్రియ, రంజీత్, జాన్ కొక్కెన్ నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ,(Amazon prime video), సన్ ఎన్ ఎక్స్ టి (Sun NXT) లలో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
తొమ్మిదవ శతాబ్దంలో ఆది గురువు ఆదిశంకరాచార్యులు, భారతదేశం అంతటా తిరిగి శక్తి పీఠాలను నిర్మిస్తాడు. అయితే బద్రీనాథ్ దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఒక శక్తి పీఠాన్ని, ఒక కుటుంబం పురాణ కాలం నుంచి కాపాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి కేరళ నుంచి కొంతమంది వలస వచ్చి అక్కడే జీవిస్తూ ఉంటారు. అందులో పట్టాభిరామ్ ప్రస్తుతం ఆ శక్తి పీఠాన్ని కాపాడుతూ ఉంటాడు. మరోవైపు మహమ్మద్ అనే ఒక వ్యక్తి కొత్తగా వచ్చి, ఊరి చివర నివాసం ఏర్పరచుకుంటాడు. ఊరిలో జరిగే అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఒక స్వామీజీ ఆశ్రమాన్ని కట్టాలని చూస్తుంటాడు. చూడటమే కాకుండా కట్టడం కూడా మొదలు పెడతాడు. అయితే ఆ ఊరిలో అందరిని, రౌడీలను పెట్టి బెదిరించి ఖాళీ చేపిస్తారు.
పట్టాభిరామ్ తాను ఇంటిని ఖాళీ చేయనని మొండికేస్తాడు. ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మవారి శక్తి పీఠం ఉంటుంది. అతన్ని ఖాళీ చేయమని కొంత గడువు కూడా ఇస్తారు ఆ రౌడీలు. అయితే ఆ గడువు తీరిపోవడంతో అతనిపై కుట్ర మొదలు పెడతారు. నిజానికి ఈ స్వామీజీ ఒక దొంగ బాబా. కార్పొరేట్ కంపెనీలు స్వామీజీ ద్వారా మొదట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న భూములను కొనేస్తారు. ఆ తర్వాత భూములకు ధర ఎక్కువగా పలుకుతుంది. ఇలా ఇప్పుడు ఈ ప్రాంతం మీద కూడా వాళ్ళు పడతారు. ఇళ్ళు ఖాళీ చేయకపోవడంతో, పట్టాభి కూతురికి విష ప్రయోగం చేపిస్తాడు ఆ దొంగ బాబా. ఈ కుట్రలో పట్టాభి కూతురు అన్యాయంగా చనిపోతుంది. చివరికి పట్టాభిని కూడా చంపేస్తారా? స్వామీజీకి పట్టాభి ఎదురు తిరుగుతాడా? మహమ్మద్ వీళ్లకు ఎలా సాయం చేస్తాడు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘తియాన్’ (Tiyaan) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.