Heggana Muddu OTT: కన్నడ స్టార్ నటుడు డాలీ ధనంజయ తన నిర్మాణ సంస్థ ‘డాలీ పిక్చర్స్’ ద్వారా విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలోనే 2000వ దశకం చివరి నాటి రెట్రో నేపథ్యంలో రూపొందిన కామెడీ డ్రామా థ్రిల్లర్ ‘హెగ్గణ ముద్దు’ (Heggana Muddu) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆర్కెస్ట్రా మైసూరు’, ‘డేర్‌డెవిల్ ముస్తఫా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పూర్ణచంద్ర మైసూరు, అదితి సాగర్ జంటగా నటించిన ఈ సినిమా.. ఓ పెళ్లి బంధంలో మొదలయ్యే అనుమానాలు, అపార్థాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూపిస్తుంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అసలు కథేంటో తెలుసుకుందాం పదండి.
స్మార్ట్‌ఫోన్లు లేని రోజులు.. 2000వ దశకం చివరి నాటి వాతావరణంలో ఈ కథ సాగుతుంది. అజిత (పూర్ణచంద్ర మైసూరు)కు త్వరగా డబ్బు సంపాదించి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలనే కోరిక ఎక్కువ. అందుకోసం ఒక పిరమిడ్ స్కీమ్‌ను నమ్ముకుని, దాని ద్వారా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పెద్దలు కుదిర్చిన పెళ్లితో ప్రేరణ (అదితి సాగర్) అతడి జీవితంలోకి వస్తుంది.
పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట మధ్య మొదట్లో అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ అజితలోని అనుమాన స్వభావం, అభద్రతా భావం క్రమంగా వారి బంధంలో సమస్యలను సృష్టిస్తాయి. భార్యపై నమ్మకం లేకపోవడం, చిన్న విషయాలకే అనుమానపడటం.. ఇలా పరిస్థితులు ఒక్కొక్కటిగా చేయి దాటిపోతుంటాయి. మరోవైపు డబ్బు చుట్టూ అల్లుకున్న వ్యవహారాలు, ఊహించని పరిణామాలు కథను మరో మలుపు తిప్పుతాయి. అసలు అజిత, ప్రేరణల మధ్య ఏం జరుగుతుంది? వారి జీవితాల్లో దాగున్న రహస్యాలేంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
‘హెగ్గణ ముద్దు’ (Heggana Muddu) చిత్రంలో పూర్ణచంద్ర మైసూరు అజితగా, అదితి సాగర్ ప్రేరణగా నటించగా, విజయ్ శోభరాజ్ పావూర్, భరత్ నాయక్, మైసూర్ ఆనంద్, రేఖా కుడ్లిగి, రవి పూజారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నచికేత్ బలెక్కల కథ, సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ బలెక్కల దర్శకత్వం వహించారు. డాలీ పిక్చర్స్ బ్యానర్‌పై డాలీ ధనంజయ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ చెన్నోజీ రావు, రోణద బక్కేష్ సంగీతం అందించారు. 2026న సెప్టెంబర్ 25 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2026 నవంబర్ 13 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ కన్నడ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.