E-Paper
Advertisement

దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ
Advertisement

Marathi Horror Comedy on OTT: సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ మనిషిని ఎలాంటి ప్రమాదకరమైన చిక్కుల్లోకి నెడుతుందో వినోదాత్మకంగా చూపించిన చిత్రం ‘భూతం భయ్యం’ (Bhootam Bhayyam). మరాఠీ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సూపర్ నేచురల్ కామెడీ డ్రామా, థియేటర్లలో ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ‘లాపతా లేడీస్’ ఫేమ్ ఛాయా కదమ్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ కరణ్ సోనావానే కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా సాగింది. ఏడుగురు నిరుద్యోగ స్నేహితులు, ఓ పాడుబడ్డ బంగ్లా, దేన్నైనా బంగారంగా మార్చగలదని చెప్పుకునే ఓ మాయా నాణెం.. ఈ మూడు అంశాల చుట్టూ సినిమా కథ సాగుతుంది. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, ఆ పాడుబడ్డ బంగ్లాలో బ్యాచిలర్స్‌కు ఎదురైన వింత అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళ్తే…

ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏడుగురు స్నేహితులు ఎలాగైనా త్వరగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఈ క్రమంలో వారికి రాణివాడ అనే పురాతనమైన, పాడుబడిన బంగ్లాలో ఉండే అవకాశం వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఆ బంగ్లాలో వారికి ‘పరీస్’ (Parees) అనే ఓ విచిత్రమైన నాణెం దొరుకుతుంది. దాని ప్రత్యేకత ఏమిటంటే.. దేన్నైనా బంగారంగా మార్చగలదని చెబుతుంటారు.

Advertisement

ఇక అంతే.. ఆ నాణెం తమ చేతికి చిక్కితే కష్టాలన్నీ తీరిపోతాయని, కోటీశ్వరులైపోవచ్చని స్నేహితులు ఆశపడతారు. దాని శక్తిని ఉపయోగించుకోవడానికి ప్లాంచెట్ ప్రయోగాలు మొదలుపెడతారు. అయితే వారు చేస్తున్న పని ఎంత ప్రమాదకరమైనదో ఊహించలేరు. ఎన్నో ఏళ్లుగా ఆ బంగ్లాలో దాగి ఉన్న శాపానికి సంబంధించిన దుష్టశక్తులు మేల్కొంటాయి. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒకవైపు భయపెట్టే ఆత్మలు, మరోవైపు ఆ నాణెం కోసం వెతికే క్షుద్రశక్తులు, మాంత్రికుల నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ గందరగోళంలో గజ్జా (కరణ్ సోనావానే) అదృశ్యం కావడంతో మిగతా స్నేహితుల ఆందోళన మరింత పెరుగుతుంది. అసలు ఆ నాణెం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రాణివాడ బంగ్లాకు ఉన్న శాపం ఏంటి? కనిపించకుండా పోయిన గజ్జా ఏమయ్యాడు? డబ్బు ఆశతో మొదలైన వారి ప్రయాణం చివరకు ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? అనేదే మిగతా కథ. హారర్, కామెడీ, సస్పెన్స్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించే ప్రయత్నం చేస్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ? 

Advertisement

‘భూతమ్ భయ్యమ్’ సినిమాలో ఛాయా కదమ్, కరణ్ సోనావానే, నీల్ సాలేకర్, సౌరభ్ ఘడ్గే, శుభమ్ జాదవ్, సిద్ధాంత్ సర్ఫరే, పుష్కరాజ్ చిర్పుట్కర్, మన్మీత్ పెమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రామచంద్ర గావ్ంకర్ రచన, దర్శకత్వం వహించగా, నరేన్ కుమార్, మహేశ్ కోరాడే నిర్మించారు. జీ స్టూడియోస్ మరాఠీ ఈ చిత్రాన్ని సమర్పించింది. ఈ సినిమా 2026 జూలై 24న థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ 25 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ మరాఠీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు.

Read Also: తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

Tags

Related News

వయసు పైబడిన తండ్రికి తల్లిగా మారిన కూతురు… బాధ్యతలు, భావోద్వేగాల మధ్య నలిగిపోయిన ఆడబిడ్డ కథ

అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ

భర్తకు పిల్లలు పుట్టరని తెలిసినా భార్య ప్రెగ్నెంట్.. మాజీ భార్య ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మాఫియా డాన్… దేశాన్నే గడగడలాడించిన రక్తచరిత్ర

పులివేషాల సంస్కృతి మాటున ప్రతీకార జ్వాలలు… ఓటీటీలోకి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్

ప్రపంచాన్ని మారుస్తామని 8 బిలియన్ డాలర్ల కుంభకోణం.. ఇది చిన్న కథ కాదు భయ్యా

Big Stories

Advertisement
×