E-Paper
Advertisement

OTT Movie: అతిగా ఆలోచించడంలో ఆస్కార్ గెలుచుకునే కుర్రాడు… కడుపుబ్బా నవ్వించే సైక్ కామెడీ… నేడు ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్

OTT Movie: అతిగా ఆలోచించడంలో ఆస్కార్ గెలుచుకునే కుర్రాడు… కడుపుబ్బా నవ్వించే సైక్ కామెడీ… నేడు ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్
Advertisement

OTT Movie: ‘డీజే టిల్లు’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన రచించి, దర్శకత్వం వహించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ ‘అనుమాన పక్షి’ (Anumana Pakshi) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచించే ఓ యువకుడి జీవితంలో అనుకోకుండా ఎదురైన సమస్యలు ఎలాంటి గందరగోళానికి దారితీశాయో ఈ సినిమాలో చూపించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రెండునెలల తరువాత ఈ రోజు నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అసలు కథేంటో తెలుసుకుందాం పదండి.

అతిగా ఆలోచించడమే ఆ కుర్రాడికి పెద్ద సమస్య

సన్నీ (రాగ్ మయూర్) ఓ కంటెంట్ క్రియేటర్. అతడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, లేనిపోని అనుమానాలతో తన బుర్రను వేడెక్కించుకోవడం అతడి నైజం. అంతేకాదు, తనకు వచ్చే వింత ఆలోచనలను, అనుమానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే ఇదే అలవాటు ఒకరోజు అతడిని పెద్ద చిక్కుల్లో పడేస్తుంది. కశ్మీర్‌కు చెందిన అనంత్ అనే వ్యక్తి సన్నీకి ఫోన్ చేసి, అతడి వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని చెబుతాడు. వెంటనే కశ్మీర్‌కు రాకపోతే ఆత్మహత్య చేసుకుని, తన సూసైడ్ నోట్‌లో సన్నీ పేరు రాస్తానని హెచ్చరిస్తాడు. దీంతో భయపడిపోయిన సన్నీ తన స్నేహితుడు వర్మ (ప్రిన్స్)తో కలిసి కశ్మీర్ బయలుదేరతాడు.

కశ్మీర్‌లో ప్రేమ.. ఆ తర్వాత ఫ్రెండ్ మర్డర్

Advertisement

కశ్మీర్ చేరుకున్న సన్నీకి కన్య (మెరిన్ ఫిలిప్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. వర్మ హఠాత్తుగా హత్యకు గురవుతాడు. అంతేకాదు, ఈ హత్య కేసులో సన్నీకి కూడా చిక్కులు ఎదురవుతాయి. అదే సమయంలో విశాఖపట్నానికి చెందిన పోలీస్ అధికారి వాసు (అజయ్), ఆత్మలతో మాట్లాడే శక్తి ఉన్న తన భార్య సుజీ (రాశి)తో కలిసి అక్కడికి వస్తాడు. దీంతో సన్నీకి మరిన్ని సమస్యలు మొదలవుతాయి. అసలు వర్మను చంపిందెవరు? ఈ హత్యతో సన్నీకి ఉన్న సంబంధమేంటి? ఆత్మలతో మాట్లాడే శక్తి ద్వారా వర్మ మరణం రహస్యాన్ని సుజీ ఛేదించిందా ? పోలీసుల నుంచి తప్పించుకుంటూ అసలు నిజాన్ని సన్నీ ఎలా తెలుసుకుంటాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. కామెడీ, అనుమానాలు, మర్డర్ మిస్టరీ కలగలిసిన ఈ స్టోరీ మాత్రం ప్రేక్షకులను చివరి వరకు ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుంది.

‘అనుమాన పక్షి’ ని ఓటీటీలో చూడాలంటే?

ఈ చిత్రంలో రాగ్ మయూర్ సన్నీగా, మెరిన్ ఫిలిప్ కన్యగా, ప్రిన్స్ వర్మగా నటించగా, బ్రహ్మాజీ, అన్ననయ్య, చరిత్, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దండ్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 20, 2026 నుంచి Sun NXTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో అందుబాటులోకి వచ్చిన ఈ కామెడీ థ్రిల్లర్‌ను ఓటీటీలో చూడొచ్చు.

Advertisement

Read Also: తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

Tags

Related News

OTT Web Series: నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్

Friday OTT Releases : ఓటీటీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఏకంగా 10 స్ట్రీమింగ్..!

పెళ్లయిన కొత్తలోనే రహస్యాల సుడిగుండం… నవ్విస్తూనే ఉత్కంఠ రేపే కన్నడ కామెడీ థ్రిల్లర్

దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

వయసు పైబడిన తండ్రికి తల్లిగా మారిన కూతురు… బాధ్యతలు, భావోద్వేగాల మధ్య నలిగిపోయిన ఆడబిడ్డ కథ

అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ

Big Stories

Advertisement
×