Netflix down: కరోనా సమయంలో థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో మూవీ లవర్స్ చాలా ఫీల్ అయ్యారు. వారందరి కోరిక మేరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి. అలా ప్రస్తుతం చాలా డిజిటల్ ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా కొత్త సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో ఎక్కువగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వ్యూవర్స్ కోసం కొత్త కంటెంట్ సినిమాలను అందిస్తుంది.. ఎక్కువమంది మూవీ లవర్స్ ఇక్కడే సినిమాలను వీక్షిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఈ ప్లాట్ ఫామ్ సేవలకు అంతరాయం కలిగిందని వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్ సేవలకు అంతరాయం..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ను భారత దేశంలో మాత్రమే కాదు. అటు యునైటెడ్ స్టేట్స్ లలో యూజర్స్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్లాట్ ఫామ్ సేవలకు అంతరాయం కలిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ అంతటా వందలాది మంది వినియోగదారుల కోసం పని చేయలేదు. కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది వినియోగదారులు “తక్షణమే చూడటానికి శీర్షిక అందుబాటులో లేదు”. అంతేకాదు ఎర్రర్ అని చూపిస్తుందట.. అవుట్‌టేజ్-ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ 75,000 నివేదికలను లాగ్ చేసింది.. ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు. దయచేసి మరొక శీర్షికను ప్రయత్నించండి” అనే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. చూడటానికి ఏదైనా ఎంచుకున్నప్పుడు ఇది జరుగుతుంది” అని ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇలా చాలా మంది తమ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఎర్రర్ ఏమోస్తుందంటే..?
Netflix వెబ్‌సైట్ ప్రకారం.., ‘క్షమించండి, ఈ సమయంలో ఈ శీర్షికను తక్షణమే చూడలేరు’ మీ అకౌంట్ లో ఏదో పొరపాటు జరిగింది.. అందుకే ఈ యాప్ ను చూడలేకపోతున్నారని ఆ యాప్ ను ఓపెన్ చెయ్యగానే మెసేజ్ రావడంతో కొందరు యూజర్స్ నిరాశ పడుతున్నారు. తనకైతే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ యాప్ ఓపెన్ అవ్వడం లేదని తెలుస్తుంది. దీనిపై ఓటిటి సంస్థ ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేక పోతుంది. ఈ వార్తలు నిజమేనని కొందరు యూజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని సోషల్ మీడియా వర్గాల్లో టాక్ నడుస్తుంది..
ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, థ్రిల్లర్ సినిమాలు కూడా ఇక్కడ చూసేయొచ్చు… బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఈ వారం బోలెడు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. జూన్ నెలలో కొత్త సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయని సమాచారం..