BigTV English
Advertisement

Viral Video: వామ్మో.. నది నిండా అనకొండలు.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Viral Video: వామ్మో.. నది నిండా అనకొండలు.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

కళ్లతో చూసే అన్నీ నిజం కాదు. చెవులతో వినేవి కూడా వాస్తవాలు కావు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఏది నిజమో? ఏది అబద్దమో? చెప్పలేని అయోమయ స్థితిలో ఉన్నాం. దానికి కారణం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. AIతో క్రియేట్ చేసిన వీడియోలను చూస్తే మన కళ్లు.. మనల్నే మోసం చేస్తాయి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?..


నది నిండా అనకొండలు..

తాజాగా సోషల్ మీడియాలో రివర్ వీడియో వైరల్ అయ్యింది. దట్టమైన అడవి మధ్యలో నుంచి పారుతున్న నది మీదుగా ఓ హెలికాఫ్టర్ వెళ్తుంది. గాల్లో దూసుకెళ్తున్న పైలెట్లు ఒక్కసారిగా షాకయ్యే దృశ్యాలను చూశారు. నది నిండా అనకొండలే కనిపించాయి. ఒక్కొక్కటి మీటర్ల కొద్ది పొడవు, టన్నుల కొద్ది బరువు ఉన్నట్లు అర్థం అవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో అనకొండలు నదిలో కదులుతూ కనిపించాయి. సదరు హెలికాప్టర్ పైలెట్లు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వామ్మో.. ఇవేం అనకొండలు రా బాబోయ్ అంటూ భయంతో వణికిపోయారు.


ఆ అనకొండలు నిజంగానే ఉన్నాయా?

వాస్తవానికి ఈ వైరల్ వీడియో నెటిజన్లలో రకరకాల సందేహాలకు కారణం అయ్యింది. ఈ వీడియోను చూసి చాలా మంది భయంతో వణికిపోయారు. “ఆ నదిలో అనకొండలు నిజంగానే ఉన్నాయా?” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. తెలియక “ఒకవేళ ఆ నదిలోకి వెళ్తే, ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “పురాణకాలంలో ఇలాంటి అనకొండలు ఉండేవని విన్నాం. ఇప్పుడు నిజంగానే చూస్తున్నాం” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు.

Read Also: భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ.. మరీ ఇంత ఘోరమా?

AI మాయాజాలం కాదు కదా?

తొలుత ఈ వీడియోను  ‘official_Sheye’ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్ది లైకులు వచ్చాయి. ఈ భయానక వీడియోను చూసి నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అయితే, ఈ వీడియో నిజం కాదంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. ఈ వీడియోను ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఉంటారని మరికొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఒక రెండు తలల పాము కూడా ఉంది. క్రియేటర్ల ఎంత ఓ వీడియోను తయారు చేసేప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనేదానికి ఈ పాము కూడా ఉదాహారణగా చెప్పుకోవచ్చు. సాధారణ మనుషులు ఎవరు చూసినా, అది నిజమైన వీడియో అని ఇట్టే నమ్మేలా ఉంది. చాలా మంది ఈ వీడియోను చూసి నిజమైనది కాదని గుర్తించారు. అదో ఏఐ మ్యాజిక్ అని నమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read Also: పాము తొలిసారి కాటు వేసినప్పుడు విషం విడుదల చేయదా? ఎందుకలా?

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×