OTT Movie : భయపేడుతూ ఎంటర్టైన్ చేసే సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి హారర్ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలను పగలు ఎవరైనా చూస్తారు. అదే రాత్రి పూట ఒంటరిగా చూడాలంటే ప్యాంటు తడిచిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీని చివరి వరకు సస్పెన్స్ తోనే నడిపించాడు దర్శకుడు. అందరూ చూసే విధంగానే మూవీ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది మ్యాడ్ ఉమెన్స్ బాల్’ (The mad womens Ball). లారెంట్, క్రిస్టోఫ్ డెస్లాండ్స్ స్క్రీన్ ప్లే నుండి మెలానీ లారెంట్ ఈ మవవీకి దర్శకత్వం వహించారు. 2021 లో వచ్చిన ‘ది మ్యాడ్ ఉమెన్స్ బాల్’ అనే ఈ ఫ్రెంచ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీని విక్టోరియా మాస్ రాసిన లే బాల్ డెస్ ఫోల్స్ నవల ఆధారంగా రూపొందించబడింది. లారెంట్, లౌ డి లాగే, ఇమ్మాన్యుయెల్ బెర్కోట్, బెంజమిన్ వోయిసిన్, సెడ్రిక్ కాన్ మరియు గ్రెగోయిర్ బోనెట్ ఇందులో నటించారు. ఇది 12 సెప్టెంబర్ 2021 లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను కలిగి ఉంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ కి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. అవి తనలోకి వచ్చినప్పుడు ఆమె చాలా వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇలా ప్రవర్తించడంతో ఆమె మీద తండ్రికి పెద్దగా ఇష్టం ఉండదు. హీరోయిన్ కి తమ్ముడు తో పాటు, ఒక అమ్మమ్మ కూడా ఉంటుంది. ఒకసారి హీరోయిన్ ఒంట్లో ఒక ఆత్మ వస్తుంది. ఆమె వెంటనే సంవత్సరాల పాటు కనిపించకుండా పోయిన ఒక పెద్ద హారాన్ని అమ్మమ్మకి ఇస్తుంది. అది చూసి అమ్మమ్మ షాక్ అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడో కనిపించకుండా పోయింది. తనకెలా తెలిసిందని ఆశ్చర్యపోతుంది. మరోవైపు తండ్రి కూతురికి బాగు చేయాలని ఒక మానసిక ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అక్కడ కూతుర్ని జాయిన్ చేసి వచ్చేస్తాడు. అప్పటినుంచి అందులో ఉన్న సిబ్బంది ఆమెను టార్చర్ పెడుతుంటారు. తనకు పిచ్చి లేదని ఎంత చెప్పినా వినరు.
ఒకసారి అందులో పని చేసే నర్స్ ఆమెకు ఆత్మలు వస్తాయి అని నమ్ముతుంది. అయితే మిగతా సిబ్బంది, ఆమెకు అక్కడ ఉన్న తీవ్రమైన శిక్షలు వేస్తుంటారు. చివరికి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుంటుందా? ఆమెకు ఆత్మలు ఎందుకు కనపడుతున్నాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది మ్యాడ్ ఉమెన్స్ బాల్’ (The mad womens Ball) అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూడండి.