E-Paper
Advertisement

అంగీకారం లేకుండా ఆ పని… ప్రియురాలి కంప్లైంట్ తో రాత్రికి రాత్రే హీరో అరెస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

అంగీకారం లేకుండా ఆ పని… ప్రియురాలి కంప్లైంట్ తో రాత్రికి రాత్రే హీరో అరెస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Bandar OTT Release: ప్రేమ, పేరు, డబ్బు అన్నీ ఉన్నా ఒక్క ఆరోపణతో జీవితం మొత్తం తలకిందులైతే ? ఒకప్పుడు టీవీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి, ఒక్కసారిగా నిందితుడిగా జైల్లోకి వెళ్లాల్సి వస్తే ? తాను చేయని నేరాన్ని నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థతోనే పోరాడాల్సి వస్తే ? బాబీ డియోల్ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘బందర్’ (Bandar) స్ట్రీమింగ్ ఓటీటీలో షురూ అయ్యింది. ప్రేమ, ఆరోపణ, మీడియా తీర్పు, న్యాయపోరాటం, జైలు వంటి అంశాలతో సాగే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక మనిషి జీవితాన్ని ఒక్క ఆరోపణ ఎలా మార్చేస్తుందో చూపిస్తుంది. మరి బాబీ డియోల్ పాత్రపై వచ్చిన ఆరోపణ ఏంటి ? అసలు ఆ కేసు వెనుక నిజం ఏమిటి ? ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సమర్ మెహ్రా ఒకప్పుడు టీవీలో నటించిన స్టార్. వయసు పెరుగుతున్న కొద్దీ అతని కెరీర్ నెమ్మదిగా డౌన్ అవుతూ వస్తుంటుంది. సినిమాల్లో పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తూనే స్టేజ్ షోలు చేస్తూ జీవితం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఖుషీ అనే యువతితో కొత్త సంబంధాన్ని మొదలు పెడతాడు. కానీ అతని గతంలో ఉన్న గాయత్రి మళ్లీ అతని జీవితంలోకి రావడంతో పరిస్థితులు మారిపోతాయి. ఆమెతో మాట్లాడకుండా సమర్ ఆమెను బ్లాక్ చేయడంతో సమస్య మరింత పెద్దదవుతుంది.

Advertisement

ఒక రోజు సమర్ ఇంటికి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. గాయత్రిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణ అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తుంది. కోర్టులో కూడా పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉండవు. చివరికి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతను ఎదుర్కొనే అవమానాలు, ఒత్తిడి, అనుమానాలు అతని మానసిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తాయి. అయితే గాయత్రి చేసిన ఆరోపణ నిజమేనా ? సమర్ నిజంగా నేరం చేశాడా ? లేక అతని గత సంబంధమే అతన్ని ఈ కేసులో ఇరికించిందా ? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సమర్ ఎలాంటి పోరాటం చేశాడు ? అసలు నిజం బయటపడేలోపు అతని జీవితం ఎంతగా మారిపోయింది ? అనేదే ఈ సినిమాలో చూడాల్సిన అసలు విషయం.

తెలుగులో అవైలబుల్ గా ఉందా ?

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘బందర్’లో బాబీ డియోల్, సన్యా మల్హోత్రా, సబా ఆజాద్, సప్నా పబ్బీ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 జూన్ 5న థియేటర్లలో విడుదల కాగా, ఆగస్టు 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘బందర్’ హిందీ ఆడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో లేదు. ఒక ఆరోపణతో మనిషి జీవితం ఎలా మారిపోతుంది ? నిజం కంటే ముందే సమాజం తీర్పు చెప్పేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నలను క్రైమ్, లీగల్ డ్రామా టచ్‌తో చూపించే ‘బందర్’ సీరియస్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మస్ట్ వాచ్ మూవీ.

Advertisement

Read Also: గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

Tags

Related News

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

Big Stories

Advertisement
×