BigTV English

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈజీ మనీ కోసం దీనికి మించిన ఆయుధం నేరస్తులకు దొరకట్లేదు. ఈ నేపథ్యంలో భారతదేశంలో జరిగిన అతి పెద్ద కాల్ సెంటర్ స్కామ్ డాక్యుమెంటరీ ఇండియన్ సర్కిల్స్‌లో గుర్తింపు పొందింది. ఈ డాక్యుమెంటరీ ఇండియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ లోపాలను, అంతర్జాతీయ సహకార అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఇది 2024 ఏప్రిల్ 10న న్యూ ఢిల్లీలోని అమెరికన్ సెంటర్‌లో యు.ఎస్. ఎంబసీ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ డాక్యుమెంటరీ వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

2013-2016 మధ్య మహారాష్ట్రలోని థానేలో జరిగిన కాల్ సెంటర్ స్కామ్ చుట్టూ ఈ డాక్యుమెంటరీ తిరుగుతుంది. 600 మంది ఉద్యోగులతో నడిచిన ఈ స్కామ్‌లో, భారతదేశం నుండి IRS (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) అధికారులుగా నటించిన స్కామర్లు, ప్రధానంగా అమెరికాలోని సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసి, $50 మిలియన్లకు పైగా దోచుకున్నారు. వీళ్ళంతా ఎక్కువగా సీనియర్ సిటిజెన్స్ ని టార్గెట్ చేసి. ఫోన్‌లో భయపెట్టి, అరెస్ట్ చేస్తామని బెదిరించి, వారి బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బు బదిలీ చేయించుకునేవాళ్ళు. డాక్యుమెంటరీలో ఫార్మర్ కాల్ సెంటర్ ఉద్యోగులు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్, FBI అధికారులు, ఇండియన్ పోలీస్ ఇంటర్వ్యూల ద్వారా ఈ స్కామ్ సెక్రెట్స్ ని వివరించారు. స్కామర్లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి, థానే నుండి అహ్మదాబాద్, గుజరాత్‌కు విస్తరించిన నెట్‌వర్క్‌ను నడిపినట్లు డాక్యుమెంటరీ వెల్లడిస్తుంది.


ఈ డాక్యుమెంటరీ థానే, అహ్మదాబాద్‌లో జరిగిన పోలీసు రైడ్స్, FBIతో ఇండియన్ పోలీస్ సహకారాన్ని హైలైట్ చేస్తుంది. 15,000 మంది అమెరికన్లను మోసం చేసిన ఈ స్కామ్, మాస్టర్‌మైండ్స్‌ను గుర్తించడానికి జరిగిన ఇన్వెస్టిగేషన్‌ను చూపిస్తుంది. మీడియా, సైబర్ ఎక్స్‌పర్ట్స్, లాయర్లతో నెలల పాటు రిసెర్చ్, డ్రామటైజ్డ్ సీన్స్, కాల్ సెంటర్ వీడియోలు ఈ డాక్యుమెంటరీలో చేర్చబడ్డాయి. స్కామర్లు బాధితులను ఎలా టార్గెట్ చేశారో, వారి “గ్రీడ్” ఎలా కుటుంబాలను నాశనం చేసిందో చూపిస్తుంది. ఈ స్కామ్ భారతదేశ ఖ్యాతిని దెబ్బతీసినట్లు న్యూ ఇండియా అబ్రాడ్ పేర్కొంది. నేషనల్ అవార్డ్ విన్నర్ డిరెక్టర్ సత్యప్రకాష్ ఉపాధ్యాయ, సైబర్ క్రైమ్ అవగాహన కోసం ఈ డాక్యుమెంటరీని రూపొందించాడు.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘బోగస్ ఫోన్ ఆపరేటర్స్’ (Bogus Phone Operators) 2024లో విడుదలైన భారతీయ క్రైమ్ డాక్యుమెంటరీ. ఇది సత్యప్రకాష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో, నిర్వాణ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందింది. ఇందులో ప్రశాంత్ మాలి (సైబర్ క్రైమ్ లాయర్), రితేష్ షా (సీనియర్ జర్నలిస్ట్), సుహేల్ దాద్ (FBI లీగల్), అమిత్ దుబే (సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్), విశాల్ భానుశాలి (క్రిమినల్ లాయర్), నీతిన్ ఠాక్రే (సీనియర్ పోలీస్ అధికారి) పాల్గొన్నారు. 2024 మార్చి 8న డాక్యుబే, ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, 44 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఇది ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులో ఉంది.

Read Also : రాత్రయితే క్రూరంగా మారే ముసలి భర్త… మొగుడి కళ్లు గప్పి పెయింటర్ తో యవ్వారం… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Related News

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : దీపావళికి ఓటీటీలో టపాసుల్లాంటి మూవీస్… వీకెండ్లో ఈ సినిమాలు, సిరీస్ లు డోంట్ మిస్

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×