OTT Movie : రొమాంటిక్ ఎలిమెంట్స్, ఎథికల్ ఎరోటిక్ సన్నివేశాలతో ఒక హాలీవుడ్ సినిమా వివాదాస్పదంగా మారింది. కానీ ఈ చిత్రం ఎరోటిక్ డ్రామా అభిమానులకు చూడదగ్గ చిత్రమే. ఇందులో ఇద్దరమ్మాయిలు ప్రేమలో మునుగుతారు. కొన్ని సీన్స్ పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఈ మసాలా కంటెంట్ ని ఒంటరిగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘పిక్చర్ ఆఫ్ బ్యూటీ’ (Picture of Beauty) 2017లో విడుదలైన బ్రిటిష్ ఎరోటిక్ డ్రామా చిత్రం. మాక్సిమ్ ఫోర్డ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో టేలర్ సాండ్స్ (జూలియా), డానియెల్ రోజ్ (స్టెఫానీ), పావెల్ హాజ్నోస్ (ఫ్రానెక్), మాగ్డలీనా బోచన్-జాచిమెక్ (హాజెల్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2017 మార్చి 14న విడుదలైన ఈ 70 నిమిషాల చిత్రం IMDbలో 3.5/10 రేటింగ్ ను అందుకుంది. అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఒక తూర్పు యూరప్ గ్రామంలో, ఫ్రానెక్ అనే ఒక ప్రతిభావంతమైన చిత్రకారుడు, తన సహాయకురాలు హాజెల్ తో కలిసి ఒక బ్రోతల్ హెడ్ నుండి ఒక ఎరోటిక్ పెయింటింగ్ కోసం కమిషన్ తీసుకుంటాడు. ఆమె వ్యాపారాన్ని పెంచడానికి ఈ చిత్రం ఉపయోగపడుతుందని భావిస్తుంది. ఫ్రానెక్ పెయింటింగ్ కోసం బ్రోతల్‌లోని అమ్మాయిలతో సంతృప్తి చెందక, మరింత ఆకట్టుకునే మోడల్స్ కోసం వెతుకుతాడు. జూలియా, స్టెఫానీ అనే ఇద్దరు అమ్మాయిలు ఫ్రానెక్ కంట్లో పడతారు. ఫ్రానెక్ తన పెయింటింగ్ కోసం వీళ్ళను మోడల్‌గా ఎంచుకుంటాడు. స్టెఫానీ, జూలియా ఒక రోజు సరస్సు వద్ద బట్టలు లేకుండా ఈత కొడుతూ, తమలోని కోరికలను బయట పెట్టుకుంటారు. ఇది వారి మధ్య రొమాంటిక్, ఎరోటిక్ బంధానికి దారితీస్తుంది.
జూలియా తండ్రి, ఒక కఠినమైన మత గురువు. ఆమె లెస్బియన్ అని తెలిసి, ఆమెను క్రూరంగా శిక్షిస్తాడు. జూలియాకి వయసు మళ్ళిన వ్యక్తితో పెళ్ళి కూడా జరిపిస్తారు. ఆమె తన భర్త నుండి విముక్తి కోసం పోరాడుతుంది. ఇది గ్రామంలోని అణచివేత ధోరణిని హైలైట్ చేస్తుంది. అయితే ఇప్పుడు స్టెఫానీ, జూలియా అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఫ్రానెక్ పెయింటింగ్‌లో మోడల్‌గా పాల్గొంటారు. ఈ సమయంలో జూలియా, స్టెఫానీ మధ్య రొమాన్స్ మొదలవుతుంది. స్టెఫానీ, జూలియా మధ్య సరస్సు వద్ద లెస్బియన్ ఎన్‌కౌంటర్ తో మొదటి అడుగు పడుతుంది. క్లైమాక్స్‌లో ఫ్రానెక్ తన మాస్టర్‌పీస్‌ను పూర్తి చేస్తాడు. స్టెఫానీ, జూలియా తమ ప్రేమను సాధిస్తారు. ఈ కథ ఇలా ముగుస్తుంది.
Read Also : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్