Tv Serial Actress : తెలుగులో ఎన్నో ప్రముఖ చానల్స్ ఉన్నాయి. అందులో కొన్ని చానల్స్ సీరియల్స్లను ప్రసారం చేస్తుంటాయి. ఆ సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.. అందులోని క్యారెక్టర్లు నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో జనాలు సీరియల్స్ ను చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఎంతగా సీరియల్స్ అంటే చెవులు కోసుకుంటారో చెప్పనక్కర్లేదు.. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో నటిస్తున్న కొంతమంది హీరోయిన్లు ఆడియన్స్ హృదయాల్లో తమ నటనతో చెరగని ముద్ర వేసుకుంటారు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ హీరోయిన్ల రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న యాక్టర్స్ రియల్ ఏజ్ గురించి తెలుసుకుందాం.
కావ్య శ్రీ..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ సీరియల్స్ లలోని హీరోయిన్లలో ఒకరు కావ్య శ్రీ.. ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’, ‘గువ్వ గోరింక’ వంటి సీరియళ్లతో తెలుగులో పాపులరైన కావ్యశ్రీ నటిస్తున్న ఈమె ఈ మధ్య చిన్ని సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సీరియల్ హీరో నిఖిల్ తో బ్రేకప్ అయిన తర్వాత ఈమె బాగా హైలైట్ అయింది. ఈమె సెప్టెంబర్ 6 1996 లో జన్మించారు. ఈమె వయసు 28 సంవత్సరాలు.
తేజెస్విని గౌడ..
మోడల్, నటి అయిన తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న ఈ బ్యూటీ సువర్ణలో వచ్చిన కన్నడ సీరియల్ ‘బిలి హెండి’లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన ‘కోయిలమ్మ’ సీరియల్ చేసింది.. ఇప్పటికీ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్న ఈమె రియల్ ఏజ్ చాలా మందికి తెలియదు.. ఈమె 1995 నవంబర్ 22 న జన్మించారు. 32 ఇయర్స్..
నిహారిక చౌదరి..
స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్లో శృతి క్యారెక్టర్ లో నటించిన నిహారిక చౌదరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ఈ సీరియల్ కన్నా ముందు పలు సీరియల్స్లలో నటించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లతో పాటుగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.. 2, జనవరి 1999 లో జన్మించారు.. ఈమెకు 26 ఏళ్లు.
ప్రియాంక జైన్..
జానకి కలగనలేదు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టింది.. ప్రస్తుతం సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఈమె జులై రెండో తారీఖున 1998 లో జన్మించారు. వయసు 27 ఏళ్లు.
అన్షు రెడ్డి..
ప్రస్తుతం స్టార్ మా లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ లో గవర్నమెంట్ ఉద్యోగి సాధారణ కుటుంబంలోని కోడలుగా అన్షు రెడ్డి నటిస్తుంది.. ఈ సీరియల్ ద్వారా ఈమె బాగా పాపులారిటీని సంపాదించుకుంది. 29 జనవరి 1992 లో జన్మించారు.. ఈమె వయసు 33 ఏళ్లు..
శోభా శెట్టి..
స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది శోభ శెట్టి. ఇందులో మౌనిత పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు విలన్గా బాగా దగ్గరయింది. 20 జనవరి 1990 లో జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 33 ఏళ్లు.
Also Read : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..
వీర్లే కాదు ఇలా చాలామంది బుల్లితెరపై హీరోయిన్లుగా కొనసాగుతున్న వారంతా కూడా 40 ఏళ్లలోపే ఉన్నారు.. కొందరు అంతకన్నా తక్కువ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం బిజీ గా సీరియల్స్ చేస్తున్నారు..