BigTV English

OTT Movie : మనుషుల కళ్ళూ, చెవులూ కుట్టేసి గోడలో దాచే ముసలి సైకోలు… వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : మనుషుల కళ్ళూ, చెవులూ కుట్టేసి గోడలో దాచే ముసలి సైకోలు… వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : డిఫరెంట్ ఆంథాలజీ స్టోరీలను ఇష్టపడేవాళ్ళకి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా మూడు స్టోరీలతో నడుస్తుంది. ప్రతీ స్టోరీ క్లైమాక్స్ లో కనెక్ట్ అవుతుంది. ఈ స్టోరీలన్నీ’బుక్స్ ఆఫ్ బ్లడ్’ అనే పుస్తకం చుట్టూ తిరుగుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


హులు (HULU) ఓటీటీలో

ఈ అమెరికన్ ఆంథాలజీ హారర్ మూవీ పేరు ‘బుక్స్ ఆఫ్ బ్లడ్’ (Books of blood). 2020 లో వచ్చిన ఈ సినిమాకి బ్రానన్ బ్రాగా దర్శకత్వం వహించారు. ఇందులో బ్రిట్ రాబర్ట్‌సన్, అన్నా ఫ్రీల్, రఫీ గావ్రాన్, యుల్ వాజ్క్వెజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 2020 అక్టోబర్ 6న స్క్రీమ్‌ఫెస్ట్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా హులు (Hulu) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

బెన్నెట్, స్టీవ్ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు, ఒక బుక్‌షాప్ ఓనర్ దగ్గరకి,అప్పును వసూలు చేసుకోవడాని వస్తారు. అతను ప్రాణాలను కాపాడుకోవడానికి, ఒక మిలియన్ డాలర్ల విలువైన ‘బుక్ ఆఫ్ బ్లడ్’ గురించి చెబుతాడు. అది ఒక పాడుబడిన పట్టణంలో ఉందని తెలియజేస్తాడు. ఇప్పుడు బెన్నెట్ అతన్ని చంపి, ఈ పుస్తకం కోసం వెతకడానికి స్టీవ్‌తో కలిసి బయలుదేరతాడు. ఈ స్టార్టింగ్ సీన్ తో మూడు కథలు నడుస్తాయి. జెన్నా, మైల్స్, బెన్నెట్ కథలు ‘బుక్ ఆఫ్ బ్లడ్’ తో మొదలవుతాయి.

1. జెన్నా కథ: జెన్నా ఒక కాలేజ్ లో చదువుతుంటుంది. ఆమె మిసోఫోనియాతో బాధపడుతుంది. ఇది చిన్న చిన్న శబ్దాలకు తీవ్రంగా చిరాకుపెట్టే ఒక మానసిక రోగం. ఆమె తన మందులను తీసుకోవడం మానేసి, ఇంట్లో నుండి పారిపోతుంది. ఆమె ఎల్లీ, సామ్ అనే ఒక వృద్ధ దంపతులు ఉండే ఇంటిలో ఆశ్రయం పొందుతుంది. ఈ దంపతులు స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ, ఈ ఇంటిలో ఏదో తప్పు జరుగుతోందని జెన్నా గ్రహిస్తుంది. గోడలలో నుంచి వచ్చే వింత శబ్దాలు ఆమెను భయపెడతాయి. చివరికి ఎల్లీ, సామ్ ఒక దారుణమైన రహస్యాన్ని దాచిపెడుతున్నారని తెలుస్తుంది. వాళ్ళు జెన్నా లాంటి ప్రయాణీకులను, మాదక ద్రవ్యాలతో మత్తులోకి నెట్టి చంపుతారు. వారి శరీరాలను గోడలలో దాచి, వారి వస్తువులను దొంగిలిస్తారు. జెన్నా తన మిసోఫోనియాను ఉపయోగించి ఈ దంపతులను ఎదుర్కొని, ఒక ట్రక్కును దొంగిలించి పారిపోతుంది. కానీ ఆమె ఒక కారు ఢీకొట్టి ఆసుపత్రిలో చేరుతుంది.

2. మైల్స్ కథ: మేరీ ఒక సైకాలజిస్ట్. ఆమె 7 ఏళ్ల కొడుకు మైల్స్ లుకేమియాతో చనిపోతాడు. దీనివల్ల ఆమె చాలా బాధలో ఉంటుంది. ఆమె కొత్త ప్రియుడు సైమన్ తన చనిపోయిన కొడుకుతో మాట్లాడగలనని చెప్తాడు. సైమన్ ఒక నకిలీ గోస్ట్ విస్పరర్‌గా ఉంటాడు. మేరీ అతని మాటలను నమ్ముతుంది. అయితే ఆతరువాత సైమన్ మోసం బయటపడుతుంది. మేరీ ప్రతీకారంగా అతన్ని ఒక పాత గదిలో బంధిస్తుంది. ఈ సమయంలో నిజమైన దెయ్యాలు సైమన్‌ శరీరంపై చనిపోయినవారి కథలను, గాజు ముక్కలతో చెక్కుతాయి. అతన్ని ఒక “బుక్ ఆఫ్ బ్లడ్”గా మారుస్తాయి. మేరీ ఈ కథలను పుస్తకాలుగా రాసి మిలియన్ల డబ్బును సంపాదిస్తుంది.

3. బెన్నెట్ కథ: బెన్నెట్, స్టీవ్ ఒక బుక్‌ షాప్ ఓనర్ చెప్పిన పాడుబడిన పట్టణానికి చేరుకుంటారు. అక్కడ వీళ్ళు అతీంద్రియ సంఘటనలను ఎదుర్కొంటారు. స్టీవ్ తన చనిపోయిన తల్లి గొంతును విని, తనను తాను కాల్చుకుంటాడు. అయితే బెన్నెట్ కారులో పారిపోతూ ‘బుక్ ఆఫ్ బ్లడ్’ఉన్న చోటుకి చేరుకుంటాడు. అక్కడ అతను మేరీని కలుస్తాడు. మేరీ బెన్నెట్‌కు అతని కథ కూడా సైమన్ శరీరంపై చెక్కబడిందని చెబుతుంది. బెన్నెట్ దెయ్యాలకు భయపడి , తనను తాను పొడుచుకుంటాడు. చివరికి జెన్నా, మైల్స్, బెన్నెట్ ఏమవుతారనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పేకాటలో భార్యను యజమానికి తాకట్టు పెట్టే పనోడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు మైండ్ బ్లాక్

Related News

OTT Movie : భర్త ఉండగానే మరొకడితో… వెంకటేష్ హీరోయిన్ ఇలాంటి రోల్ లో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : కళ్ళముందే తండ్రి శిరచ్ఛేదం… ఫ్యామిలీ బహిష్కరణ… ఇది దేవుడికే చుక్కలు చూపించే దెయ్యం మావా

OTT Movie : పేరుకే గ్యాంగ్ స్టర్ క్రైమ్ డ్రామా… మొత్తం అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా ?

OTT Movie : ఏఐతో ప్రేమ… అంత్యక్రియల కోసం వెళ్తే అంతు చిక్కని మిస్టరీ… మైథలాజికల్ స్టోరీలో మతిపోగోట్టే ట్విస్ట్.

OTT Movie: ఆత్మల నుంచి కూతురిని రక్షించుకునే తల్లి కథ.. ఓటీటీకి వచ్చేస్తోన్న మైథలాజికల్‌ హారర్‌ మూవీ..

Paradha Movie : ఆ ఓటీటీలోకి అనుపమ ‘పరదా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Big Stories

×