BigTV English

OTT Movie : పేకాటలో భార్యను యజమానికి తాకట్టు పెట్టే పనోడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు మైండ్ బ్లాక్

OTT Movie : పేకాటలో భార్యను యజమానికి తాకట్టు పెట్టే పనోడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు మైండ్ బ్లాక్

OTT Movie : జూదం ఎంత భయాంకరమైనదో మహాభారతంలో ఎప్పుడో చూపించారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా జూదంలో తన భార్యని తాకట్టు పెడతాడు ఒకభర్త. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కి అందరికీ ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మరాఠీ డ్రామా మూవీ పేరు ‘సర్లా ఏక్ కోటి’ (Sarla ek koti Marati). 2023లో విడుదలైన ఈ సినిమాకి నితిన్ సింధువిజయ్ సుపేకర్ దర్శకత్వం వహించారు.దీనిని సాన్వీ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈ సినిమాలో ఒంకర్ భోజనే (భీకాజీ), ఈషా కేస్కర్ (సర్లా), చాయా కదమ్, అభిలాషా పౌల్, కపిల్ కాంబ్లే గుడ్సూర్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఈ మూవీ 2023 జనవరి 20న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 7.3/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

భీకాజీ అనే కార్మికుడు, కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితితో ఇబ్బందులు పడతాడు. భీకాజీ ఒక సాధారణ గ్రామీణ మహారాష్ట్ర వ్యక్తి. అతను తన అందమైన సర్లా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆమె అందం చూసి, గ్రామంలోని ఇతర మగవాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది. భీకాజీ లాంటి కూలోడికి ఇలాంటి పెళ్ళాం వచ్చిందేమిటని అందరూ ఆశ్చర్య పోతారు. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా భీకాజీ త్వరగా డబ్బు సంపాదించాలని, ఒక పెద్ద తప్పు చేస్తాడు. జూదంలో తన దగ్గర ఉన్న డబ్బును పందెం వేస్తాడు. భీకాజీ ఆడే ఈ జూదం అనుకోని పరిణామాలకు దారితీస్తుంది. అతను ఒక స్థానిక ఠేకేదార్‌ అనే వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇది అతని భార్య సర్లాను పందెంగా పెట్టడానికి దారితీస్తుంది.

అయితే భీకాజీ ఈ జూదంలో ఓడిపోతాడు. ఒప్పందం ప్రకారం, ఠేకేదార్ సర్లాను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఈ షాకింగ్ ట్విస్ట్ కథ ఒక మలుపు తిప్పుతుంది. గ్రామంలోని ఇతర పురుషులు కూడా భీకాజీకి డబ్బు సహాయం చేసేందుకు ముందుకొస్తారు. వాళ్ళంతా ఈ సహాయం సర్లాను పొందే షరతు మీద యిస్తారు. ఇప్పుడు సర్లా తన గౌరవం కోసం పోరాడాల్సి వస్తుంది. భీకాజీ తన తప్పును తెలుసుకుని సర్లాను తిరిగి పొందడానికి, తన ఆర్థిక పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఈ సినిమా చివరిలో వచ్చే హైలైట్ ట్విస్ట్ కి ప్రేక్షకుల మతిపోతుంది. చివరికి భీకాజీ పందెం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది ? సర్లా ఎలాంటి పోరాటం చేస్తుంది ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… క్లైమాక్స్ లో బుర్ర పాడు ట్విస్ట్

Related News

OTT Movie: దెయ్యం బారి నుంచి కూతురిని రక్షించుకునే తల్లి కథ.. ఓటీటీకి వచ్చేస్తోన్న మైథలాజికల్‌ హారర్‌ మూవీ..

Paradha Movie : ఆ ఓటీటీలోకి అనుపమ ‘పరదా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

OTT Movie : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

Big Stories

×