OTT Movie : రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఈ సినిమాలలో హాట్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సీన్స్ ఆలోచనలో పడేస్తాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ కి కావలసింది ఈ సినిమాలలో బాగా దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఒక డాక్టర్, తన పేషెంట్స్ తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ పని కోసం సపరేట్ గా ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ ఆసక్తిని పెంచుతాయి. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘బ్రోవనీయన్ మూవ్మెంట్’ (Brownian Movement). ఈ మూవీకి నానొక్ లియో పొల్ దర్శకత్వం వహించారు. ఇందులో చార్లెట్, బెంజిమెన్ తమ కొడుకుతో కలసి జీవిస్తూ ఉంటారు. చార్లెట్ తన పేషెంట్స్ తో, కొంతమందిని అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్ళి రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం భర్తకు తెలిసిన తరువాత పరిస్తితి తారుమారు అవుతుంది. పెద్దలకు మాత్రమే ఈ మూవీ చూడటానికి బాగుంటుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
చార్లెట్ ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఈమెకు బెంజిమెన్ అనే భర్త కూడా ఉంటాడు. వీళ్ళిద్దరి సంసారం బాగా సాగిపోతూ ఉంటుంది. అయితే చార్లెట్ మాత్రం తన పేషెంట్స్ తో రొమాన్స్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఆమె ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన పేషెంట్లను, అద్దె ఇంటికి తీసుకెళ్లి రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెతో రొమాన్స్ చేసే వాళ్ళల్లో మూసలివాళ్ళతో పాటు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. భర్తకు తెలియకుండా ఇదంతా మేనేజ్ చేస్తుంది చార్లెట్. ఒకరోజు ఆమెతో ఇంటిమేట్ అయిన వ్యక్తి బయట చూసి తన దగ్గరికి వస్తాడు. అయితే అతను ఎవరో తెలియనట్టు, అతని మొఖం పగలగొడుతుంది చార్లెట్. ఆ తర్వాత ఈ విషయం భర్తతో పాటు అందరికీ తెలిసిపోతుంది.
చార్లెట్ ఇలా ఎందుకు చేస్తుందో తెలీక ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తారు. ఎందుకు ఇలా చేశావని డాక్టర్ అడిగినప్పుడు అది తనకే తెలియకుండా జరిగిపోయింది అని చెప్తుంది. ఆమె డాక్టర్ గా కొనసాగకూడదని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకొని మళ్లీ తనతోనే జీవితం మొదలు పెడతాడు భర్త. చివరికి చార్లెట్ అలా పేషెంట్లతో ఎందుకు చేసింది? తన తీరు మార్చుకుంటుందా? భర్తతో సంతోషంగా జీవిస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్రోవనీయన్ మూవ్మెంట్’ (Brownian Movement) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.