OTT Movie : నిజజీవితంలో జరిగే స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నిజంగానే జరిగినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో కొంతమంది ఆకతాయిల వల్ల, అమ్మాయిల జీవితాలు చెప్పుకోలేని స్థితికి వెళ్తాయి. ఈ మూవీలో కొంతమంది ఆకతాయిలు ప్రేమికుల వీడియోలు తీసి వైరల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ జీవితాలు ఏమవుతాయనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మూవీ పేరు ‘బుల్బుల్ కెన్ సింగ్’ (Bulbul can sing). 2018 లో వచ్చిన ఈ అస్సామీ డ్రామా మూవీకి రీమా దాస్ దర్శకత్వం వహించారు. ఇది 2018 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, కాంటెంపరరీ వరల్డ్ సినిమా విభాగంలో ప్రదర్శించబడింది. ముగ్గురు టీనేజర్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రేమికుల వీడియొ తీసి కొంతమంది వైరల్ చేస్తారు. టీనేజ్లో జరిగే మార్పులు ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బుల్ బుల్, మేఘ ఈ ఇద్దరమ్మాయిలు చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. వీళ్లకు బన్నీ అనే కుర్రాడు కూడా తోడు అవుతాడు. అతడు కుర్రాడు అనేకంటే, గే అనటమే బెటర్. గే లక్షణాలు ఎక్కువగా ఉండటంతో, అతన్ని అందరూ ఎగతాళి చేస్తుంటారు. అయితే ఈ అమ్మాయిలు మాత్రం అతనితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా కలిసి తిరుగుతూ ఉంటారు. బుల్బుల్, సుమన్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. మేఘ కూడా వరుణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఇలా ఈ జంటల లవ్ స్టోరీ చక్కగా సాగిపోతూ ఉంటుంది. బుల్బుల్ తండ్రి గ్రామాలలో నాటకాలు వేస్తుండటంతో, అప్పుడప్పుడు పాటలు కూడా పడుతుంది బుల్బుల్. ఇలా చక్కగా సాగిపోతున్న వీళ్ళ జీవితం అనుకోకుండా మలుపు తిరుగుతుంది. ఒంటరిగా సరదాగా కబుర్లు చెప్పుకోవాలని ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తారు ఈ జంటలు. వీళ్ళకు కాపలాగా బన్నీని పెట్టి మరీ పొదల్లోకి వెళతారు.
అక్కడికి పోకిరిలు రావడంతో బన్నీ పారిపోతాడు. అక్కడికి వచ్చి ఆకతాయిలు, వీళ్ళ వీడియోలు తీసి నలుగురిలో అల్లరి చేస్తారు. అల్లరి చేయడమే కాకుండా వీళ్ళ వీడియోలను వైరల్ చేస్తారు. స్కూల్ యాజమాన్యం వీళ్ళని పిలిపించి దండిస్తుంది. ఇంతకు ముందులా వీళ్ళు సరదాగా ఉండలేకపోతారు. అయితే పరువు పోయిందని ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కూతుర్ల జీవితం అల్లరిపాలు అయిందని బాధపడుతుంటారు. తల్లి బాధ చూడలేక మేఘ సూసైడ్ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసి బుల్బుల్ ఇంకా బాధపడుతుంది. చివరికి బుల్బుల్ పరిస్థితి ఏమవుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బుల్బుల్ కెన్ సింగ్’ (Bulbul can sing) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.