BigTV English
Advertisement

OTT Movie : 15 దేశాల్లో బ్యాన్ చేసిన మూవీ… రిలీజ్ అయిన దేశాల్లో ఆ సీన్స్ కట్

OTT Movie : 15 దేశాల్లో బ్యాన్ చేసిన మూవీ… రిలీజ్ అయిన దేశాల్లో ఆ సీన్స్ కట్

OTT Movie : సైకోలు రకరకాలుగా ఉంటారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అన్నట్టు, కొంతమందికి పిచ్చి పీక్స్ కి వెళుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్లకి అర్థం కాదు. అటువంటి సైకోలు చేసే అరాచకాలతో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని కొన్ని సినిమాలను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ఈ సినిమాలలో హింస చాలా ఎక్కువగా ఉండడం వల్లే అటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడ మనం చెప్పుకునే మూవీలో వయసు తగ్గించే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. దీనికోసం అమ్మాయిలని బంధించి టార్చర్ చేస్తుంటారు. భయపెట్టే ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్రీడర్’ (Breeder). ఒక హెల్త్ సప్లిమెంట్ కంపెనీ వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడానికి, శిశువుల DNA ని బయోహ్యాక్ చేసే ప్రయోగం చేస్తుంది. ఇందులో భాగంగా యువతులను అపహరించడం ప్రారంభిస్తుంది. ఈ చీకటి వ్యాపారాన్ని మియా అనే మహిళ కనిపెట్టడానికి బయలుదేరుతుంది. అయితే ఆమె చివరికి మానవ మృగాల చేతిలో చిక్కుకుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కేథరిన్ ముసలి వయసును తగ్గించే ఒక ప్రయోగం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం మాట్లాడుతుంది. ఆమెను ఇంటర్వ్యూలో చూసి థామస్ అనే వ్యక్తి భయపడతాడు. ఎందుకంటే కేథరిన్ కి ఫైనాన్షియల్ గా థామస్ హెల్ప్ చేస్తాడు. థామస్ ని కేథరిన్ ఒక హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. అయితే పోలీసులకు ఈ విషయం చెప్పకుండా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అందువల్లే థామస్ ఆమెకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంటాడు. కానీ కేథరిన్ ప్రయోగాలకు, అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసి, పిల్లల డిఎన్ఏ తో ఈ ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయం థామస్ భార్యకి తెలిసిపోతుంది. ఆ ప్రయోగశాలకి ఒంటరిగా వెళ్లి ఏం జరుగుతుందో  తెలుసుకోవాలనుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే కేథరిన్ ఆమెను కూడా బంధిస్తుంది.

థామస్ కి విషయం చెప్పి, తనని కూడా ప్రయోగానికి వాడుకుంటామని చెప్తుంది. ఆ తర్వాత మనం ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతులం అవుతామని చెప్పి అతని మనసు మారుస్తుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆమె ఇద్దరు సైకోలను పనిలో పెట్టుకుని ఉంటుంది. వాళ్లు చేసే అరాచకాల వల్లే ఈ సినిమా ను చాలా దేశాలలో బ్యాన్ చేశారు. చివరికి థామస్ తన భార్యను రక్షించుకుంటాడా? కేథరిన్ ప్రయోగాలు ఏమవుతాయి? పోలీసులకు ఈ విషయం తెలుస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్రీడర్’ (Breeder) అనే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని చూడండి.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×