E-Paper
Advertisement

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు సరికొత్త స్టోరీలతో సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ IMDbలో 9 రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఉత్కంఠభరతంగా సాగే ఒక స్పై స్టోరీ. భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW), పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మధ్య జరిగే ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

కథలోకి వెళ్తే

Advertisement

1966లో భారత అణు శాస్త్రవేత్త హోమి జహాంగీర్ భాభా విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. ఇది విదేశీ గూఢచార సంస్థల (CIA) కుట్రగా అనుమానిస్తారు. ఈ సంఘటన భారత అణు కార్యక్రమానికి ఎదురుదెబ్బగా మారుతుంది. దీని తర్వాత R&AW స్థాపించబడుతుంది. విష్ణు శంకర్ ఒక R&AW గూఢచారి. హోమి భాభా మరణంలో తన వైఫల్యం గురించి అపరాధ భావనతో ఉంటాడు. మరోవైపు 1971లో ఇండో-పాక్ యుద్ధం తర్వాత, పాకిస్తాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీనిని భారతదేశం నిరోధించాలని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో
విష్ణు అండర్ కవర్‌లో ఇస్లామాబాద్‌కు వెళ్తాడు. అతని లక్ష్యం పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం. అతను ముర్తజా మాలిక్ అనే ISI చీఫ్‌తో మైండ్ గేమ్ లో బిజీ అవుతాడు.

Read Also : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

సుఖ్‌బీర్ అనే ఒక భారతీయ గూఢచారి, కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రఫీక్ అనే మారుపేరుతో బ్రోకర్‌గా పనిచేస్తాడు. అతను విష్ణు బృందంలో కీలక సభ్యుడు. కానీ తన గుర్తింపు ఎక్కడ బయటపడుతుందో అని నిరంతరం భయపడుతుంటాడు. అతను తన కుటుంబ జీవితాన్ని కోరుకుంటాడు. కానీ దేశం కోసం తనను తాను త్యాగం చేయాల్సిన సందర్భం ఎదురవుతుంది. పాకిస్తాన్ ఫ్రాన్స్ నుండి ఒక అణు రియాక్టర్‌ను రహస్యంగా కొనుగోలు చేస్తుందని తెలుసుకున్న విష్ణు బృందం, గదానీ పోర్ట్ వద్ద దానిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రణాళికలో సుఖ్‌బీర్ కీలక పాత్ర పోషిస్తాడు. తన జీవితాన్ని బలిదానం చేస్తూ ఒక పేలుడు పదార్థాలతో నిండిన బోట్‌ను రియాక్టర్ షిప్‌పైకి ఢీకొట్టి, మిషన్‌ను విజయవంతం చేస్తాడు.
Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘సారే జహాన్ సే అచ్ఛా: ది సైలెంట్ గార్డియన్స్’ అనేది ఒక బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్. సుమిత్ పురోహిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతీక్ గాంధీ , సన్నీ హిందుజా, సుహైల్ నయ్యర్, కృతికా కామ్రా, తిలోత్తమా షోమ్, రాజత్ కపూర్, అనుప్ సోనీ, హేమంత్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ 2025 ఆగస్టు 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, IMDbలో 9.0/10 రేటింగ్ ను పొందింది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×