E-Paper
Advertisement

ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర

ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర
Advertisement

Tamil Romantic Comedy Series: రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీయడంలో తమిళ మేకర్స్ కు మంచి పట్టు ఉంది. తక్కువ బడ్జెట్ తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కు నవ్వుల విందు అందించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆసక్తికరమైన కథనం, క్రేజీ కంటెంట్ తో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తారు. ఇప్పుడు అలాంటి నెక్స్ట్ లెవెల్ కామెడీతో వచ్చిన తమిళ వెబ్ సిరీస్ ‘మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్’ (Mr & Mrs Office) ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో భార్యాభర్తలు ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. అయితే తమ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి, ఆఫీసులో ఒకరికొకరు తెలియనట్లు నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ మామూలుగా ఉండదు. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఈ రోజు (నవంబర్ 18) జియో హాట్‌స్టార్ లో రిలీజ్ అయిన కొద్దిసేపటికే కామెడీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కథలోకి వెళ్తే…

అరివు, ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. ఇద్దరూ ఒకే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు సంపాదిస్తారు. మొదట్లో ఒకే చోట పనిచేసే అవకాశం రావడంతో సంతోషించిన ఈ జంటకు కంపెనీ నిబంధన రూపంలో పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆ సంస్థలో కుటుంబ సభ్యులు ఒకే కంపెనీలో కలిసి పనిచేయడానికి అనుమతి ఉండదు. ఈ విషయం యాజమాన్యానికి తెలిస్తే ఇద్దరిలో ఒకరు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

అక్కడి నుంచే అసలు కామెడీ మొదలవుతుంది. ఇంట్లో భార్యాభర్తలుగా ప్రేమగా ఉండే ఈ ఇద్దరూ ఆఫీసులో మాత్రం కనీసం పరిచయం కూడా లేనివారిలా నటించాలి. మీటింగుల్లో ఒకరినొకరు చూసినా పలకరించకూడదు. తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అనుమానంగా గమనిస్తున్నారంటే వెంటనే మాట మార్చేయాలి. పైగా కఠినమైన బాస్, ఆఫీసు రాజకీయాలు, సహోద్యోగుల ప్రశ్నలు.. ఇలా ప్రతిరోజూ వీరి రహస్య కాపురానికి కొత్త పరీక్ష ఎదురవుతుంది. చిన్న విషయం బయటపడినా ఉద్యోగాలకు ప్రమాదం కావడంతో అరివు, ఐశ్వర్య చేసే విన్యాసాలు ఎలాంటి నవ్వులు పూయిస్తాయో ఈ సిరీస్‌లో చూడొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఉద్యోగ జీవితంలోని ఒత్తిళ్లు, ఆఫీసులో ఎదురయ్యే సరదా సంఘటనలతో కథ సాగుతుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్’ (Mr & Mrs Office) సిరీస్‌లో అరివుగా ప్రదీప్ ఆంటోనీ, ఐశ్వర్యగా స్మేహా మణిమేగలై నటించారు. సనమ్ శెట్టి, దర్శకుడు మగిళ్ తిరుమేని తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించగా, జెగన్ బాస్కరన్ నిర్మించారు. JioHotstar లాంగ్ రన్నింగ్ షోస్‌లో భాగంగా రూపొందిన ఈ సిరీస్‌ను మొత్తం 100 ఎపిసోడ్లతో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రతి బుధవారం నాలుగు ఎపిసోడ్ల చొప్పున విడుదల చేయనున్నారు. 2026నవంబర్ 18 నుంచి ఈ తమిళ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్ JioHotstar (JioHotstar ) లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: 9 ప్రాణాల్లో 8 పోగొట్టుకున్న పిల్లి… చివరి ప్రాణం కోసం భయంకరమైన తోడేలుతో పోరాటం.. పిల్లలకు, పెద్దలకు ఫుల్ మీల్స్

Tags

Related News

అత్యంత సంపన్నుల చీకటి కోణం.. హైస్కూల్ నుంచే మొదలైన నేర చరిత్ర.. ఈ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

కత్తి దూస్తే శవాల దిబ్బలే.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

సూపర్ పవర్స్ ఉన్న పిల్లలపై సీక్రెట్ ఎక్స్‌పెరిమెంట్స్… భూగర్భ జైలు బద్దలుకొట్టి తిరుగుబాటు… గూస్‌బంప్స్ తెప్పించే సిరీస్

కెరీర్ క్లోజ్ అయిందని అందరూ నవ్వారు… 17 ఏళ్ల కుర్రాడితో ప్రపంచానికే సవాల్ విసిరిన మాజీ ఛాంపియన్…

పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

క్రైమ్ నవల రాయమని పిలిస్తే… ఎడిటర్‌నే కిల్లర్‌గా మార్చే రచయిత్రి… ఈ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా

బయటకు మగధీరులే… లోపల మాత్రం ఎంత భయమో ? మగాళ్లు చూడాల్సిన డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×