E-Paper
Advertisement

అత్యంత సంపన్నుల చీకటి కోణం.. హైస్కూల్ నుంచే మొదలైన నేర చరిత్ర.. ఈ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

అత్యంత సంపన్నుల చీకటి కోణం.. హైస్కూల్ నుంచే మొదలైన నేర చరిత్ర.. ఈ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
Advertisement

True Crime Documentary OTT: బయటకు చూస్తే వాళ్లు కోట్లాది రూపాయల వ్యాపారం చేసే బడా బిజినెస్‌మెన్.. న్యూయార్క్, మయామి నగరాల్లో సంపన్నులకు విలాసవంతమైన భవంతులు అమ్ముతూ పేరు, పలుకుబడి సంపాదించారు. ఖరీదైన పార్టీలు, సెలబ్రిటీలతో పరిచయాలు, విలాసవంతమైన జీవితం.. ఇదీ ప్రపంచానికి కనిపించిన వారి అసలు రూపం. కానీ ఆ మెరుపుల వెనుక మహిళల జీవితాలను ఛిద్రం చేసిన భయంకరమైన నేర చరిత్ర దాగి ఉందని తెలిస్తే షాకవుతారు. డబ్బు, పలుకుబడితో ఏళ్ల తరబడి సాగించిన అకృత్యాలు చివరకు ఎలా బయటపడ్డాయి? బాధితులు చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే నిజ జీవిత ఘటనలతో రూపొందిన క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘ది వోల్వ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్: ది అలెగ్జాండర్ బ్రదర్స్’ (The Wolves of Real Estate: The Alexander Brothers) ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

టాల్, ఓరెన్, అలోన్ అలెగ్జాండర్.. ఈ ముగ్గురు సోదరులు అమెరికాలోని లగ్జరీ రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సెక్యూరిటీ రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, మయామిలోని సంపన్నులకు ఖరీదైన భవంతులు విక్రయిస్తూ భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అయితే వీరి విలాసవంతమైన జీవనశైలికి మరో చీకటి కోణం ఉందని పలువురు మహిళలు ఆరోపించారు. పార్టీలకు, విలాసవంతమైన విహారయాత్రలకు ఆహ్వానించి మహిళలకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

ఈ వ్యవహారం బయటపడటంతో ఒక్కొక్కరుగా బాధిత మహిళలు ముందుకొచ్చారు. వీరి ఆరోపణలు కేవలం వ్యక్తిగత ఫిర్యాదులుగా మిగిలిపోకుండా పెద్ద క్రిమినల్ కేసుగా మారాయి. చిన్నప్పటి నుంచి మయామిలో గడిపిన రోజుల్లోనే మహిళల పట్ల వీరి ప్రవర్తన ఎలా ఉండేదనే విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీ పరిశీలిస్తుంది. బాధితుల ఇంటర్వ్యూలు, గతంలో వెలుగులోకి రాని దృశ్యాలు, జర్నలిస్టుల పరిశోధన, కోర్టు విచారణకు సంబంధించిన వివరాలతో ఈ ముగ్గురి ఎదుగుదల నుంచి పతనం వరకు జరిగిన పరిణామాలను చూపిస్తుంది. 2026 మార్చిలో ముగ్గురు సోదరులూ ఫెడరల్ కేసులో దోషులుగా తేలగా, అక్టోబర్ 27న ఒక్కొక్కరికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. ఇంతటి సంపన్నులుగా ఎదిగిన ఈ ముగ్గురు సోదరులు చివరకు ఎలా నేరస్తులుగా మారారు? బాధితులు న్యాయం కోసం చేసిన పోరాటం ఏమిటి? అనేది ఈ సిరీస్‌ ను చూస్తే తెలుస్తుంది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఎమ్మా ష్వార్ట్జ్ దర్శకత్వం వహించిన ఈ మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌లో జర్నలిస్టులు బ్రిడ్జెట్ రీడ్, జేమ్స్ డి. వాల్ష్ సహా బాధితులు, కేసుతో సంబంధం ఉన్న పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 45 నుంచి 57 నిమిషాల నిడివితో ఉంటుంది. అమెరికాలో 2026 అక్టోబర్ 25న విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం భారతదేశంలో JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి తెలుగు డబ్బింగ్ లేదు.

Advertisement

Read Also: చుట్టూ శత్రువులు.. తప్పించుకునే దారే లేదు… ఉగ్రవాదులకు ఒంటరిగానే చుక్కలు చూపించిన ప్రెసిడెంట్…

Tags

Related News

కత్తి దూస్తే శవాల దిబ్బలే.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

సూపర్ పవర్స్ ఉన్న పిల్లలపై సీక్రెట్ ఎక్స్‌పెరిమెంట్స్… భూగర్భ జైలు బద్దలుకొట్టి తిరుగుబాటు… గూస్‌బంప్స్ తెప్పించే సిరీస్

కెరీర్ క్లోజ్ అయిందని అందరూ నవ్వారు… 17 ఏళ్ల కుర్రాడితో ప్రపంచానికే సవాల్ విసిరిన మాజీ ఛాంపియన్…

పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

క్రైమ్ నవల రాయమని పిలిస్తే… ఎడిటర్‌నే కిల్లర్‌గా మార్చే రచయిత్రి… ఈ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా

బయటకు మగధీరులే… లోపల మాత్రం ఎంత భయమో ? మగాళ్లు చూడాల్సిన డాక్యుమెంటరీ

చుట్టూ శత్రువులు.. తప్పించుకునే దారే లేదు… ఉగ్రవాదులకు ఒంటరిగానే చుక్కలు చూపించిన ప్రెసిడెంట్…

Big Stories

Advertisement
×