OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నిజ జీవితంలో జరిగినట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమాలు సరదాగా సాగిపోతూ, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో నలుగురు మహిళలు కలసి, ఒక్క మగాడితో కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు. ఆతరువాత స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (Youtube)లో
ఈ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘చార్ లుగాయ్'(Chaar Lugaai). 2023లో విడుదలైన ఈ సినిమాకి ప్రకాశ్ సైని దర్శకత్వం వహించారు. ఇందులో నిధి ఉత్తమ్, ఆయుష్ చతుర్వేది, దీప్తి గౌతమ్, మనసీ జైన్ తదితరులు నటించారు. స్ట్రిప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP బ్యానర్ లో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో నివసించే నలుగురు వివాహిత మహిళల చుట్టూ తిరుగుతుంది. వారి భర్తలు నగరాల్లో పని చేస్తూ ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తారు. ఈ క్రమంలో వాళ్ళు పక్క చూపులు చూస్తూ అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఈ సినిమా లో డార్క్ కామెడీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా కూడా అనిపిస్తాయి. ఇందులో ఆ నలుగురు మహిళలు తమ సమంధాలను సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నాలు హైలైట్ గా ఉంటాయి. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఉత్తరప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామంలో నలుగురు స్నేహితులు ఉషా , రష్మి, మీనూ, రంజూ ఒక నివసిస్తుంటారు. వారి భర్తలు కుటుంబ బాధ్యతలను మోయడానికి నగరాల్లో పనిచేస్తూ ఉంటారు. వారి భర్తలు నగరాల్లో పని చేస్తూ ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తారు. అందువల్ల ఈ మహిళలు శారీరకంగా వేరేవాళ్ళతో కలవడానికి పక్క చూపులు చూస్తుంటారు. ఉషా అదే గ్రామంలోని ఒక బాడీబిల్డర్ అయిన దుగ్గుతో రహస్యంగా సంబంధం పెట్టుకుంటుంది. ఇది తెలుసుకున్న రష్మి, మీనూ కూడా తమ శారీరక అవసరాల కోసం దుగ్గుతో సంబంధం కోరుకుంటారు. ఉషా తన స్నేహితుల కోరికను నెరవేర్చడానికి, దుగ్గుని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కానీ దుగ్గు ఉషా ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా మరణిస్తాడు. ఈ ఊహించని సంఘటన నలుగురు మహిళలను ఒక సమస్యలో చిక్కుకునేలా చేస్తుంది. దుగ్గు మరణాన్ని దాచడానికి వారు చేసే ప్రయత్నాలు కథను ఒక మలుపు తిప్పుతాయి. ఆతరువాత ఇది ఒక పోలీసు కేసుగా మారుతుంది. ఇన్‌స్పెక్టర్ సంతోష్ గుప్తా ఈ కేసును దర్యాప్తు ప్రారంభిస్తాడు. దుగ్గు మరణం ఒక ప్రమాదమా లేక హత్యా అనే ప్రశ్న కథను ముందుకు నడిపిస్తుంది. చివరికి ఈ అక్రమ సంబంధాల గురించి భర్తలకు తెలుస్తుందా? దుగ్గును చంపింది ఎవరు? పోలీసులు ఈ కేసులో బయటపెట్టే విషయాలు ఏమిటి? వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న, ‘చార్ లుగాయ్'(Chaar Lugaai) అనే ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.