Horror Movie OTT : హారర్ జోనర్ లో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కో సినిమా ఒక్కో విధమైన కథతో ప్రేక్షకులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా హారర్ సన్నివేశాలు ఉండటంతో మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ హారర్ మూవీలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఓ భయంకరమైన హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ పేరేంటి.? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
Also Read :నితిన్ ‘రాబిన్‍హుడ్’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్..ఎక్కడంటే?
మూవీ & ఓటీటీ..
తమిళ మూవీ అగత్యా. ఇదొక హారర్ మూవీ.. హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా అగత్యా. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకం పై ఐసరి గణేష్ నిర్మించిన మూవీకి విజయ్ పా దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన అద్భుతమైన హారర్ పాంటసీ మూవీ.. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన అగత్యా ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా మూడు భాషల్లో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో అంతగా మెప్పించలేక పోయింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. మార్చి 28 నుంచి అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అగత్యా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం..
స్టోరీ విషయానికొస్తే..
హారర్ సినిమాలంటే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ పరిశోధనలో భాగంగా జీవా హీరోయిన్ రాశి ఖన్నా ఓ బంగ్లా కి వెళ్తారు. అక్కడ వారికి విచిత్రపు సంఘటనలు ఎదురవుతాయి. అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతానికి జీవా, రాశీ ఖన్నాకు ఉన్న సంబంధం ఏంటీ? అర్జున్ కు వీళ్లకు ఉన్న సంబంధం గురించి ఇందులో చూపించారు. హారర్ సీన్లు ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకుల ను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో మూవీ యావరేజ్ గా నిలిచింది. అగత్యాలో 120 ఏళ్ల నాటి ఆత్మలను కలుసుకుని జీవా ఏం చేశాడనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇక ఈ మూవీలో జీవా ఆర్ట్ డైరెక్టర్‌గా కనిపిస్తే, అర్జున్ మాత్రం సిద్ధ వైద్యుడు గా కనిపిస్తాడు. ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. రొటీన్ స్టోరీ కావడంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో మూవీ వచ్చిన కొద్ది రోజులకే వెళ్ళిపోయింది.
అగత్యా సినిమాను దాదాపుగా రూ. 20 నుంచి 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 2.15 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. ఇక ఇందులో కమెడియన్ యోగి బాబు కామెడీని బాగా పండించారు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు మార్చి 28 ఓటిటిలోకి రాబోతున్న ఈ సినిమాను చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయండి..