BigTV English

USA F1 Visa : చదువుకునేందుకు అమెరికా వెళ్లడం ఇక కష్టమే – ఈ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది

USA F1 Visa : చదువుకునేందుకు అమెరికా వెళ్లడం ఇక కష్టమే – ఈ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది

USA F1 Visa : అమెరికా వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశించే విద్యార్థులకు ఆ దేశం మొండి చెయ్యి చూపిస్తోంది. దేశంలోని అక్రమ వలసదారుల్ని వెళ్లగొడుతూనే.. దేశంలోకి అధికారికంగా ఎంటర్ అయ్యే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్యపై కత్తెర పెడుతోంది. గత ఆర్థిక ఏడాది అంటే అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు యునైటెడ్ స్టేట్స్ (US) వెళ్లాలనుకునే విద్యార్థుల వీసా తిరస్కరణలు దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి యూఎస్ వెళ్లేందుకు అప్లై చేసుకున్న మొత్తం వీసాల్లో.. 41% F-1 వీసా దరఖాస్తులను తిరస్కరించినట్లు తేలింది. 2014 ఆర్థిక ఏడాది తర్వాత ఈ స్థాయిలో దరఖాస్తుల్ని తిరస్కరించడం ఇప్పుడే అంటున్నారు నిపుణులు.


2023-24లో అమెరికాకు F-1 వీసాల కోసం మొత్తం 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2.79 లక్షలు దరఖాస్తులు అంటే 41% తిరస్కరణకు గురయ్యాయి. F-1 వీసాల కోసం దేశాల వారీగా తిరస్కరణ రేటుపై డేటాను US స్టేట్ డిపార్ట్‌మెంట్ పంచుకోనప్పటికీ, 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులకు జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య 2023లో ఇదే కాలంతో పోలిస్తే 38% తగ్గిందని కొన్ని నివేదికలు గుర్తించాయి. గత దశాబ్ద కాలంలో అన్ని దేశాల నుంచి దరఖాస్తుల సంఖ్యా తగ్గగా.. వాటిలో విద్యార్థి వీసా తిరస్కరణల శాతం పెరిగింది.

2019-2020 కోవిడ్ సమయంలో యూఎస్ వెళ్లేందుకు కనిష్టంగా 1.62 లక్షల దరఖాస్తులు రాగా.. కోవిడ్ తర్వాత దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 6.99 లక్షలు, 2023-24లో 6.79 లక్షల దరఖాస్తులు దాఖలైయ్యాయి. F-1 వీసా అనేది USలోని విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల కోసం జారీ చేసే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. F-1 వీసా తిరస్కరణలకు కారణాలపై యూఎస్ అధికారులు స్పందించారు.


Also Read : US Attack : భీకరంగా విరుచుకుపడిన అమెరికా యుద్ధవిమానాలు.. వారిలో మొదలైన వణుకు..

వీసాల జారీ, తిరస్కరణలు ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA), ఫెడరల్ నిబంధనల ప్రకారం ఉంటాయని, ప్రతీ కేసుకు విభిన్న కారణాలుంటాయని తెలిపారు. అదే సమయంలో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇండియన్ విద్యార్థులకు 64,008 విద్యార్థి వీసాలు జారీ చేశారు. అంతకు క్రితం ఏడాది 2023లో 1.03 లక్షల వీసాలు ఆమోదం పొందాయి. 2022లో 93,181 వీసాలు, 2021లో 65,235 వీసాలు భారతీయ విద్యార్థులకు లభించాయి.

Also Read : Anti-dumping Duty : ఆ ఉత్పత్తులు దేశంలోని వస్తే భారీ నష్టం – మరిన్ని పన్నులతో భారత్ అడ్డగింత

అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం, 2023-24లో భారతీయ విద్యార్థుల సంఖ్య చైనీయుల సంఖ్యను అధిగమించింది. దీని వల్ల భారతీయులు అమెరికాలో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి సమూహంగా నిలుస్తున్నారు. మిగతా దేశాల విద్యార్థులతో పోల్చితే.. ఇండియన్ విద్యార్థులు అంతర్జాతీయ విద్యార్థులలో 29.4% వాటాను ఆక్రమిస్తున్నారు. ఓపెన్ డోర్స్ డేటా ప్రకారం, 2023-24లో అమెరికాలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కొన్ని ఇతర దేశాలు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో F-1 తిరస్కరణలలో పెరుగుదల కనిపిస్తోంది

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×