OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హడావిడి నడుస్తోంది. ఈ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ట్విస్ట్ లతో సాగిపోయే ఒక మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చక్రవ్యూహం ది ట్రాప్‘ (Chakravyuham : The Trap). 2023లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై సావిత్రి నిర్మించగా, చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2023 జూన్ 2న విడుదల చేశారు. ఒక మహిళ మర్డర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సంజయ్ తన భార్య సీరి చనిపోయిందని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. దొంగలు ఇంట్లో చొరబడి డబ్బులు కూడా తీసుకువెళ్లారని ఇన్స్పెక్టర్ తో చెప్తాడు సంజయ్. అయితే ఇన్స్పెక్టర్ మొదట సంజయ్ పైనే అనుమానపడతాడు. తన భార్యకి ఎవరితో అయినా సంబంధం ఉందని తెలిసి చంపి ఉంటాడని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పనిమనిషి భర్త కనపడకుండా పోవడంతో వాళ్లపై కూడా అనుమానిస్తాడు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఈ హత్య దొంగలు చేసింది కాదని ఇన్స్పెక్టర్ తెలుసుకుంటాడు. తెలిసిన వాళ్ళు ఈ పని చేశారనుకొని, ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్స్పెక్టర్ కి ఈ మర్డర్ కేసులో దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఇద్దరు మనుషులు ఉన్నట్టు గుర్తిస్తాడు ఇన్స్పెక్టర్.
సంజయ్ ఆఫీసులో పనిచేసే శిల్ప అనే అమ్మాయి ఈ కథంతా నడుపుతుంది. సంజయ్ ని ఇష్టపడిన శిల్ప ఎలాగైనా తనని దక్కించుకోవాలనుకుంటుంది. ఇదివరకే అతనికి పెళ్లి అయి ఉండటంతో, సంజయ్ భార్యని చంపాలనుకుంటుంది. తన ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తితో ఏకాంతంగా గడిపి, అతని సహాయంతో ఈ మర్డర్ కి స్కెచ్ వేస్తుంది. ఆ తరువాత సిరి మర్డర్ కూడా జరిగిపోతుంది. చివరికి సంజయ్ భార్య సీరిని చంపింది ఎవరు? శిల్ప పాత్ర ఇందులో ఎంత ఉంది? మరి ఎవరైనా ఈ హత్య చేశారా? ఇన్స్పెక్టర్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చక్రవ్యూహం’ (Chakravyuham : The Trap) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.