Mahakumbh Stampede: యూపీ మహా కుంభమేళాలో ఏం జరుగుతోంది? ఎందుకు అపశృతి చేటు చేసుకుంది? అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా? మిడ్ నైట్ రెండున్నర గంటల సమయంలో ఘటన ఎలా జరిగింది? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామంది భక్తులను వెంటాడుతున్నాయి.
మహా కుంభమేళాలో అపశృతులు కంటిన్యూ అవుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది భక్తులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ ఛానెళ్లు ప్రకటించాయి.
ఘటన తర్వాత వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తోంది అక్కడి సిబ్బంది. మంగళవారం అర్థరాత్రి ధాటి తెల్లవారితే బుధవారం వచ్చింది. మిడ్ నైట్ 2.30 నిమిషాలు భారీ ఎత్తున భక్తులు త్రివేణి సంగమం వద్దకు స్నానాలు చేసేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరగడంతో ఒకరిపై మరొకరు పడిపోయారు.
దీంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఘటన విషయం తెలియగానే సహాయక చర్యలు చేపట్టాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. తొక్కిసలాట విషయం తెలియ గానే ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం యోగికి ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ALSO READ: బుద్ది మార్చుకోని చైనా.. AI ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మార్చేస్తోంది. ఎలాగంటే..
మరోవైపు తొక్కిసలాట ఘటన కారణంగా అమృత స్నాన్‌ను రద్దు చేసినట్లు అఖారా పరిషత్- మండలి ప్రకటించింది. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత భక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి కుంభమేళా 1954లో జరిగింది. దేశ చరిత్రలో ఊహించని ఘటన అది. 3 ఫిబ్రవరి 1954న, అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో కుంభమేళా జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దాదాపు 800 మంది భక్తులు చనిపోయినట్లు నేషనల్ మీడియా రికార్డులు చెబుతున్నాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సరిగ్గా 1986 హరిద్వార్‌లో జరిగిన కుంభ మేళాలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం వీర్ బహదూర్ సింగ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలతో కలిసి హరిద్వార్‌కు వచ్చారు. ఆ సమయంలో గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది భక్తులను నది తీరానికి రానీయకుండా ఆంక్షలు విధించారు. వచ్చిన భక్తులను అదుపు చేయలేక పోయారు. ఫలితంగా తొక్కిసలాటకు దారి తీసింది.
మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. పుణ్యస్నానం కోసం వేలాది మంది భక్తులు గోదావరి నది తీరానికి వచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు మూడు డజన్లకు పైగా భక్తులు మరణించారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు.
సరిగ్గా పుష్కర కాలం కిందట కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. 10 ఫిబ్రవరి, 2013న చోటు చేసుకుంది. భక్తుల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా పాదచారుల వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది గాయపడిన విషయం తెల్సిందే.
కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి..!
మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట
ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం https://t.co/8txlx0sDNP pic.twitter.com/7vh6ktFCPe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025
#WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51
— ANI (@ANI) January 29, 2025