OTT Movie : నేటితరం ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు ఎక్కువగా చూస్తోంది. నచ్చిన సినిమాలను, వెబ్ సీరీస్ లను దొరికిన సమయంలో చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా వీటిని ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక చెఫ్ చుట్టూ తిరుగుతుంది. ఇతనికి వంటలకంటే, సమస్యలే ఎక్కువగావస్తుంటాయి. చివరివరకూ సస్పెన్స్ తో ఈ మూవీ థ్రిల్ చేస్తుంది. ఈ కన్నడ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ కన్నడ మూవీ పేరు ‘చెఫ్ చిదంబర'(Chef Chidambara). 2024 లో వచ్చిన ఈ కన్నడ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీకి M .ఆనంద రాజ్ దర్శకత్వం వహించాడు. ఇందులో చిదంబర అనే ఒక చెఫ్ అప్పులతో పాటు,హత్య కేసులో ఇరక్కపోతాడు. చివరికి ఎ సమస్య నుండి ఎలా బయటపడతాడనేది సినిమా క్లైమాక్స్‌లో వెల్లడవుతుంది.ఈ సినిమా ఒక వినోదాత్మక డార్క్ కామెడీగా తెరకెక్కింది. ఇందులో చిదంబర పెద్దగా వంటలు చేయకపోయినా, అతని జీవితంలోని సంఘటనలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ కన్నడ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
చిదంబర ఒక ప్రొఫెషనల్ చెఫ్ గా ఉంటాడు. అతను తన ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులుపడుతుంటాడు. వాటి నుండి బయటపడటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు అతని ఆస్తి కూడా తాకట్టులో ఉంటుంది. అతను దానిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ సందర్భంలో ఒక ధనవంతురాలైన మోనా అనే మహిళ, చిదంబరకి పరిచయం అవుతుంది. మోనా ఇదివరకే ఒక సమస్యలో చిక్కుకుంటుంది. ఆమె తన మాజీ ప్రియుడితో ఏకాంతంగా గడిపిన ఫోటోలను పొందడానికి ఇతని సహాయం కోరుతుంది. దానికి బదులుగా చిదంబర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సహాయం చేస్తానని మాట ఇస్తుంది. అయితే పరిస్థితులు అనుకోకుండా తారుమారవుతాయి. మోనా మాజీ ప్రియుడు చిదంబర ఫ్లాట్‌లో అనుకోకుండా చనిపోతాడు. ఈ సంఘటనతో చిదంబర జీవితం ఒక్కసారిగా డైలమాలో పడుతుంది. అతను ఆ శవాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో ఒక అవినీతి పోలీసు అధికారి, ఒక డాన్ హస్తం కూడా ఉంటుంది.
ఈ గందరగోళంలో చిదంబర తన ప్రేమికురాలు అను సహాయంతో, ఈ సమస్య నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి చిదంబర ఈ మర్డర్ కేసు నుంచి బయటపడతాడా ? అతని అప్పులు తీరుతాయా ? ఆ హత్య ఎవరు చేస్తారు? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చెఫ్ చిదంబర'(Chef Chidambara) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇందులో కామిడీ, థ్రిల్లర్ అంశాలు కలిపి ఉంటాయి. చివరి వరకూ ఈ మూవీ సరదాగా సాగిపోతుంది. సమయం దొరికితే ఈ వీకెండ్ ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.