OTT Movie : ఇప్పుడు ఓటీటీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే ఓటీటీ అన్నట్టుగా మారిపోయింది. ఎన్నోరకాల సినిమాలు ఇందులో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఓటీటీలో వస్తున్న సినిమాలలో కొన్ని ప్రత్యేకంగా నిలిచపోతాయి. ఈ సినిమాలు మంచి మెస్సేజ్ కూడా ఇస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఇద్దరు చిన్నపిల్లలతో నడుస్తుంది. ఈ మూవీలో బూట్ల కోసం వాళ్ళు పడే పాట్లు సరదాగా అనిపించినా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ (Children of Heaven). ఇది ఒక ఇరానియన్ దర్శకుడు మజీద్ మజీదీ రచించిన అద్భుతమైన చిత్రం. ఇందులో పిల్లల సమస్యలు, కుటుంబ బంధాలు, సామాజిక పరిస్థితులను చూపించారు. ఈ సినిమా ప్రధానంగా ఇద్దరు తోబుట్టువులు అలీ, జహ్రా అనే పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) వీడియొలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అలీ, జహ్రా అనే అన్నా చెల్లెళ్ళు ఒక స్కూల్ లో చదువుతుంటారు. ఈ చిన్న బాలుడు, తన చెల్లెలు జహ్రా బూట్లను పొరపాటున కోల్పోతాడు. వారి కుటుంబం పేదరికంలో ఉన్నందున, కొత్త బూట్లు కొనడం వారికి సాధ్యం కాదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, అలీ, జహ్రా తమకు ఉన్న ఒకే జత బూట్లను పంచుకోవాలని నిర్ణయిస్తారు. వారు పాఠశాలకు వెళ్ళే సమయాలను సర్దుకుని, ఒకరి తర్వాత ఒకరు ఆ బూట్లను వాడుతూ ఉంటారు. ఈ పరిస్థితి వారి రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లను తెస్తుంది, కానీ వారు దానిని ఎదుర్కొని తెలివి తేటలతో ముందుకు వెళ్తారు. ఒక రోజు, అలీ ఒక పరుగు పోటీ గురించి తెలుసుకుంటాడు, దీనిలో మూడవ స్థానంలో వచ్చిన విజేతకు కొత్త బూట్లు బహుమతిగా లభిస్తాయి.ఇది తెలిసి అలీ చాలా సంతోషపడతాడు. తన చెల్లెలు కోసం బూట్లు సంపాదించాలనే ఆశతో, అలీ ఆ పోటీలో కూడా పాల్గొంటాడు. ఈ కథ చివరికి ఒక భావోద్వేగంతో ముగుస్తుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.
చివరికి అలీ ఆ బూట్లను గెలుచుకుంటాడా? వీళ్ళ సమస్యలు తీరిపోతాయా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) వీడియొలో స్ట్రీమింగ్ అవుతున్న ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ (Children of Heaven) ఈ మూవీని చూడాల్సిందే. ‘Children of Heaven’మూవీలో పేదరికం, బాధ్యత, తోబుట్టువుల మధ్య ప్రేమను అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఇది సామాజిక సమస్యలను సూక్ష్మంగా చూపిస్తూ, పిల్లల జీవితాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. సినిమా సరళమైన కథనం ద్వారా లోతైన సందేశాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాని చూస్తే ఒక భావోద్వేగమైన అనుభవాన్ని అందిస్తుంది.