E-Paper
Advertisement

OTT Movie : ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోయే కారు… ఈ కారుతో పెట్టుకుంటే అంతే సంగతులు

OTT Movie : ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోయే కారు… ఈ కారుతో పెట్టుకుంటే అంతే సంగతులు
Advertisement

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లతో మూవీ లవర్స్ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వచ్చి బాగా గుర్తుండిపోతాయి. ఒక టీనేజ్ కుర్రాడు పాడుపడ్డ కారును తీసుకుని, దానినిమంచిగా తయారు చేస్తాడు. ఆ కారుకి ప్రాణం ఉందని తెలియక నడుపుతుంటాడు. ఆ కారు ఎదురొచ్చిన వాళ్ళని లేపుకుంటూ పోతుంది. ఈ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది? పేరు ఏమిటి? వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ హాలీవుడ్ సూపర్‌నేచురల్ హారర్ మూవీ పేరు ‘క్రిస్టీన్‘ (Chirstine). 1983లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ మూవీకి జాన్ కార్పెంటర్  దర్శకత్వం వహించారు. కీత్ గోర్డాన్, జాన్ స్టాక్‌వెల్, అలెగ్జాండ్రా పాల్, రాబర్ట్ ప్రోస్కీ, హ్యారీ డీన్ స్టాంటన్ నటించారు. క్రిస్టీన్ అనే కారువళ్ళ   స్నేహితులు, అతని కుటుంబం ,అతని శత్రువుల జీవితాలలో వచ్చిన మార్పులతో స్టోరీ నడుస్తుంది.  డిసెంబర్ 9, 1983న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైన ‘క్రిస్టీన్’ విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది.  బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లోనే $21 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రిక్కి, డేవిడ్ మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ స్కూల్ కి వెళ్తుంటారు. కొన్ని రోజులకు రిక్కి ఒక పాడుబడ్డ కారును చూస్తాడు. దానిని చాలా తక్కువ డబ్బుకు రిక్కికి అమ్ముతాడు కారు ఓనర్. అయితే ఇదివరకే ఆకారు వల్ల చాలా ప్రమాదాలు జరిగి ఉంటాయి. చాలామంది చనిపోయి కూడా ఉంటారు. ఆ కారుకి ప్రాణం ఉందన్న విషయం రిక్కికి నిదానంగా తెలుస్తుంది. ఆకారు వచ్చిన తర్వాత రిక్కీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఆ కార్ ని ఎందుకు కొన్నావ్ అంటూ మండిపడతారు. ఆ కార్ ని రిపేర్ చేసి మంచిగా తయారు చేస్తాడు రిక్కి. తన గర్ల్ ఫ్రెండ్ తో కారులో ఆ పని చేయబోతుందిగా, ఆమెకు ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.

ఆ తర్వాత ఆ కార్ ను బడ్డి అనే రౌడి గ్యాంగ్ తుక్కుతుక్కు చేస్తారు. కొద్దిసేపటి తర్వాత కారును చూసిన రిక్కి బాగా బాధపడతాడు. అయితే ఆ కారు తనంతట తానే రిపేర్ చేసుకుని, మళ్లీ కొత్తగా తయారవుతుంది. ఆ తర్వాత రౌడీ బ్యాచ్ ను ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. చివరికి ఈ కారు వల్ల హీరోకి ప్రమాదం ఏమైనా జరుగుతుందా? ఇంకా ఎంతమంది ప్రాణాలు ఆ కారు తీస్తుంది? ఆ కారుకి ప్రాణం ఎలా వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్రిస్టీన్’ (Chirstine) మూవీనీ మిస్ కాకుండా చూడండి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×