BigTV English

Kondapalli Srinivas: ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా..? ఇది నిజమేనా..?

Kondapalli Srinivas: ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా..? ఇది నిజమేనా..?

Kondapalli Srinivas: రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. స్థానికంగా ఆ ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. ఆ లెక్కలతోనే టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన జిల్లాకు పూర్తిగా కొత్త ముఖం అయినా కూటమి వేవ్‌లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రివర్గంలో కొత్తవారికి పెద్దపీట వేసిన చంద్రబాబు ఆయనకు కూడా కేబినెట్ బెర్త్ ఇచ్చారు. అయితే అటు సదరు నేత అటు అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోతున్నారంట.. ఇటు కేడర్ అంచనాలను కూడా అందుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆ క్రమంలో ఆయన కేబినెట్ బెర్త్ మూణ్ణాళ్ల ముచ్చటైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు?.. ఆయనపై అంత నెగిటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుంది?


మంత్రి కొండపల్లి శ్రీనివాస్ .. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి . 2024 ఎన్నికల ముందు వరకూ స్వంత నియోజకవర్గమైన గజపతినగరంలో కూడా పెద్దగా పరిచేయం లేని పేరు . అసలు విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే ఆయన పేరు ఎప్పుడూ వినిపించలేదు. అయితే ఒక్కసారిగా అదృష్టం కలిసి వచ్చి మొదటి సారి ఎమ్మెల్యే అయిన వెంటనే కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కొట్టేశారు . సీనియర్ నాయకుడు, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణని ఓడించిన మాజీ మంత్రి కళా వెంకటరావును సైతం కాదని శ్రీనివాస్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు .

కళా వెంకటరావుకు , పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్‌గజపతి రాజుకి గ్యాప్ ఉండడం కూడా కొండపల్లికి కలిసి వచ్చిందంటారు. అదీ కాక కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల ముందు చివరి నిముషంలో శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వలస వచ్చారు. శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, ఎంపి గా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగినప్పటికీ ఎప్పుడూ మంత్రి పదవి అధిరోహించలేదు. అలానే ఆయన బాబాయి కొండపల్లి అప్పలనాయుడు 2014 లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి కాలేకపోయారు . కానీ అదే ఫ్యామిలీకి చెందిన కొండపల్లి శ్రీనివాస్‌ను రాజకీయాల్లో ఎలాంటి ఒడి దొడుకులు, ఛాలెంజ్ లు ఎదుర్కొకుండానే ఎమ్మెల్యే, మంత్రి పదవులు వరించాయి .


ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి యువకుడు మంత్రి కావడంతో జిల్లా వాసులతో పాటు, ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గ ప్రజలు , టీడీపీ కార్యకర్తలు ఎంతో సంతోషించారు. మొదటి సారి తమ నియోజవర్గం నుంచి ఒకరు క్యాబినెట్ లో ఉన్నారని ఆనందపడ్డారు . కొండపల్లి పైడితల్లినాయుడు మనవడిగా తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీకి , పదవికి వన్నె తెస్తారని సంబరపడ్డారు . కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు ఆశించినంత స్పీడ్, రాజకీయ చాతుర్యం మంత్రిలో కనిపించడంలేదని పసుపు శ్రేణులు అభిప్రాయపడుతున్నాయంట . జిల్లా మంత్రిగా ఆయనలో ఎక్కడా ఆ చొరవ కనిపించడంలేదని పెదవి విరుస్తున్నారు . క్యాడర్‌కి పనులు చేసి పెట్టడం పక్కనపెడితే నేనున్నా అనే భరోసా కూడా ఇవ్వలేకపవతున్నారట . ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలోనూ మంత్రి ఫెయిల్ అవతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .

గజపతినగరం నియోజకవర్గ ప్రజలు కూడా కొండపల్లి మంత్రి అన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి . అక్కడి తెలుగు తమ్ముళ్ళే ఏం మంత్రిలే అంటూ నిట్టూరుస్తున్నారట . కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందన్నట్లు మంత్రికి వ్యతిరేఖంగా మాట్లాడలేక గమ్మున ఉంటున్నారట . లోలోపల మాత్రం కనీసం గత ప్రభుత్వ నిర్వాకాలపై అయినా స్పందించలేకపోతున్నారని చిర్రుబుర్రులాడుతున్నారంట . గతంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనరసయ్య ఎన్నో భూ దందాలు చేశారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని కనీసం వాటిపై కూడా నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఒక్క ప్రకటన కూడా చేయలేదన్న అసంతృప్తితో కనిపిస్తున్నారు

దీనికి తోడు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాళ్ళు మొక్కారంటూ వస్తున్న ఆరోపణలు కూడా కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయట. వయసులో పెద్ద వారికి, అందులోనూ స్వంత జిల్లా వారికి గౌరవం ఇవ్వడంలో తప్పేముంది అని కవరింగ్ వేసినా ఆ టాపిక్ ఇంకా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంది . కొండపల్లి బొత్స కాళ్ళు మొక్కారంట కదా అనేది ఇంకా నానుతూనే ఉంది . అయితే ఆయన మాత్రం దాన్ని తెగ ఖండించేస్తున్నారు.

Also Read: Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..

పార్టీలో కొండపల్లి అంటే పొసగని వారైతే ఇంకో అడుగు ముందుకేసి మంత్రి తండ్రి ఎన్నికల ముందే వైసీపీ నుండి డౌన్ లోడ్ అయ్యాడని , ఆ వాసనలు ఇంకా పోలేదేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకటరావు త్వరలోనే మంత్రి కాబోతున్నా అంటూ తన కేడర్ కి చెప్పుకుంటున్నారంట. ఓ వైపు మంత్రి పదవి పోతుందరి వార్తలు గుప్పుమంటున్న తరుణంలో ఆ ప్రచారం మంత్రిని మరింత ఇబ్బంది పెడుతుందట . చూడాలి మరి మంత్రివర్యులు ఎలా నెట్టుకొస్తారో?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×