OTT Movie : సినిమాలను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తుంటాం. భాషతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలను, వీలు దొరికినప్పుడల్లా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ను కూడా ఇస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ మూవీలో, ఒక ధనవంతుడు కొడుకుని పేదవాడిగా పెంచుతాడు. విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించడానికి ఇలా చేస్తాడు. ఈ మూవీ చివరివరకు సరదాగా సాగిపోతూ, మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. చైనాలో బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిన ఈ మూవీ, ప్రస్తుతం ఓటీటీ లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
ప్లెక్స్ (Plex)
ఈ చైనీస్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘సక్సెసర్’ (Successor). 2024లో విడుదలైన ఈ మూవీకి యాన్ ఫీ, పెంగ్ డామో కలసి దర్శకత్వం వహించారు. ఇందులో షెన్ టెంగ్, మా లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ చైనాలోనే అత్యంత సంపన్నులయిన మా చెంగ్‌గాంగ్, చున్‌లాన్ అనే దంపతుల చుట్టూ తిరుగుతుంది.ఈ సినిమా చైనాలో జూలై 16, 2024న విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద మూడు బిలియన్ యువాన్‌లకు పైగా వసూలు చేసింది. 2024 లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా ‘సక్సెసర్’ నిలిచింది. ఈ మూవీ ప్లెక్స్ (Plex) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
చైనాలో చెంగ్‌గాంగ్ అత్యంత ధనవంతుడిగా ఉంటాడు. ఇతనికి జియే అనే ఒక్కగానొక కొడుకు ఉంటాడు. అయితే తండ్రి తన కొడుకు సోమరిపోతుగా తయ్యారవుతాడని భయపడతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అతన్ని గారం చేయడంతో, చిన్నతనంలోనే ఏ పని సరిగ్గా చేయలేక పోతాడు.ఇక తన తర్వాత తన కంపెనీను చూసుకోవాల్సింది కొడుకే కావడంతో, చిన్న వయసునుంచే అతన్ని మరోలా పెంచాలనుకుంటాడు. తాను చిన్నప్పుడు పడ్డ కష్టాలను తలుచుకొని, అదే ప్రాంతంలో కొడుకుని పేదవాడిగా పెంచుతాడు. ఆ ప్రాంతంలో ఒక టీం ను తయారు చేసి అబ్జర్వేషన్ లో ఉంచుతాడు చెంగ్‌గాంగ్. కటిక పేదరికంలో ఉంటున్నట్టు నటిస్తూ, అతన్ని విలువగల వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటారు. పొద్దున్నే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ కి వెళ్లడంతో మొదలయ్యే ఈ ప్రయాణం రాత్రి అయ్యేదాకా కొనసాగుతుంది.
ఇంట్లో నానమ్మను ఉంచి, తల్లిదండ్రులు చిన్న పనులు చేసుకుంటున్నట్టు నటిస్తారు. ఈ క్రమంలో జియే చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతి విషయంలో అతడు మంచి మార్కులు కొట్టేస్తాడు. తండ్రికి పాడైపోయిన షూలు తేవడానికి కష్టపడటం లాంటివి చేస్తాడు. డబ్బులను పొదుపుగా ఖర్చు చేస్తాడు. ఇలా ఇంట్లోనే అతడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఇక అతడు కంపెనీకి సీఈఓ పదవి చేపట్టాల్సి వస్తుంది. చివరికి జియో కంపెనీ సీఈఓ పదవిని చేపడతాడా ? తండ్రి అనుకున్న విధంగా కొడుకు తయారవుతాడా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : హత్యలు చేసి నుదుటి మీద సంతకం … గ్యాంగ్ స్టర్ పోలీస్ ఎలా అయ్యాడు ? వామ్మో ఏందిరా సామీ ఈ ట్విస్ట్లు