E-Paper
Advertisement

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’… తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’… తెలుగులోనే  స్ట్రీమింగ్
Advertisement

The Odyssey OTT: హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓపెన్‌హైమర్’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన భారీ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) కూడా అదే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. గ్రీకు మహాకవి హోమర్ రాసిన ప్రసిద్ధ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో ఏకంగా 1.8 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15 వేల కోట్లకు పైమాటే. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ విజువల్ వండర్ ఈ రోజు నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన ఈ హాలీవుడ్ మాస్టర్ పీస్‌ను ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనే ఎంజాయ్ చేయవచ్చు.

కథలోకి వెళ్తే…

పదేళ్ల పాటు సాగిన భీకరమైన ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత కథ మొదలవుతుంది. ఇథాకా రాజు ఒడిస్సియస్ తన భార్య పెనెలోప్, కుమారుడు టెలిమాకస్ వద్దకు తిరిగి వెళ్లాలని సముద్ర ప్రయాణం మొదలుపెడతాడు. కానీ సముద్ర దేవుడు పోసిడాన్ ఆగ్రహానికి గురవడంతో అతడి ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగదు. అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతాయి. ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్, మాయలు చేసే సర్సి, భయంకరమైన సముద్ర జీవులు.. ఇలా ఎన్నో సవాళ్లు ఒడిస్సియస్ దారిని అడ్డుకుంటాయి.

Advertisement

అయితే కేవలం బలంతోనే కాకుండా తన తెలివితేటలు, ధైర్యంతో ఈ ప్రమాదాలన్నింటినీ ఎలా అధిగమించాడు? ఇన్ని అవాంతరాలను దాటుకుని చివరకు తన రాజ్యానికి చేరుకోగలిగాడా? అనేదే సినిమా. గ్రీకు పురాణాల్లోని అద్భుతమైన పాత్రలు, సాహసాలు, యుద్ధాలను క్రిస్టోఫర్ నోలన్ తనదైన భారీ మేకింగ్‌తో తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

ఈ చిత్రంలో ఒడిస్సియస్‌గా మాట్ డామన్, పెనెలోప్‌గా అన్నే హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హాలండ్ నటించారు. వీరితో పాటు రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, లుపిటా న్యోంగో, చార్లిజ్ థెరాన్, సమంతా మోర్టన్ కీలక పాత్రల్లో కనిపించారు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించగా, ఆయన భార్య ఎమ్మా థామస్‌తో కలిసి నిర్మించారు. సుమారు 2 గంటల 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2026 జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది ఉచిత సబ్‌స్క్రిప్షన్ స్ట్రీమింగ్ కాదు. నవంబర్ 17 నుంచి Amazon Prime Video, Apple TVల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమాను ఉచితంగా చూడలేరు. సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అదనంగా రెంట్ లేదా బై చేయాల్సిందే. మరో విశేషం ఏమిటంటే.. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ ఆడియో ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also: ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్

Related News

ఓటీటీలోకి రాబోతున్న ఆదర్శ కుటుంబం.. ఎప్పుడంటే?

ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

కృష్ణుడి కోసం సర్వం వదిలేశాడు… భక్తి మార్గంలో చైతన్య మహాప్రభు చేసిన అద్భుత ప్రయాణం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో మీ ముందుకు

ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్

9 ప్రాణాల్లో 8 పోగొట్టుకున్న పిల్లి… చివరి ప్రాణం కోసం భయంకరమైన తోడేలుతో పోరాటం.. పిల్లలకు, పెద్దలకు ఫుల్ మీల్స్

మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే శిక్ష ఇదేనా ? భూమి భవిష్యత్తును చూపించే ‘టైమ్ అండ్ వాటర్’

మూడేళ్లు కాపురం చేసిన ప్రియుడికి షాక్.. సడన్‌గా తిరిగొచ్చిన భర్త.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో ట్విస్టులే ట్విస్టులు

Big Stories

Advertisement
×