OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దృశ్యం సినిమా తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చే సినిమాలను ఓటిటిలో చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్లు కూడా అందుకున్నాయి. అటువంటి ట్విస్ట్ లతో సాగిపోయే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సిఐడి రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ‘ (CID Ramachandran Retd. SI). 2024 లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సనూప్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కళాభవన్ షాజోన్, బైజు సంతోష్, సుధీర్ కరమణ నటించారు. ఈ సస్పెన్స్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రామచంద్రన్ ఎస్ఐగా విధులు నిర్వహించి రిటైర్డ్ అవుతుంటాడు. డ్యూటీ చివరి రోజు కావడంతో స్టాఫ్ ని పలకరిస్తూ ఉంటాడు. అయితే పోలీస్ జీప్ ని దొంగతనం చేసిన ఒక వ్యక్తిని, ఆ టైంలో కనిపెట్టి ఆ కేసును సాల్వ్ చేస్తాడు. తన సర్వీస్ లో చాలా కేసులను తెలివిగా పట్టుకుంటాడు రామచంద్రన్. అయితే రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబంతో కలిసి సొంత ఊరికి బయలుదేరుతాడు. అక్కడ గుడిలో కానుకల రూపంలో వస్తున్న డబ్బులను ఎవరో దొంగలిస్తూ ఉంటారు. ఆ కేసును చాకచక్యంగా ఎలా పట్టుకోవాలో వాళ్లకి చెప్తాడు. ఈ క్రమంలో ఆ ఊరి మనుషులు దొంగను పట్టుకుని, రామచంద్రానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయితే అన్ని సంవత్సరాలు డ్యూటీ చేసిన రామచంద్రన్ ఒంటరిగా కూర్చోలేక మదన పడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న అతని ఫ్రెండ్ రామచంద్రానికి ఒక సలహా ఇస్తాడు. సొంతంగా ఒక డిటెక్టివ్ ఏజెన్సీని పెట్టుకోమని చెప్తాడు.
ఈ ఐడియా రామచంద్రానికి నచ్చడంతో, ఒక డిటెక్టివ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాడు. అయితే వారం వరకు ఒక్క కేసు కూడా ఇతని దగ్గరికి రాదు. రామచంద్రన్ ఫ్రెండ్ అతనికి ఒక కేసును అప్పగిస్తాడు. జయరాజ్ అనే వ్యక్తి ఊర్మిళ అనే అమ్మాయి మర్డర్ కేసులో ఇరుక్కుని ఉంటాడు. బెయిల్ మీద వచ్చిన అతను రామచంద్రాన్ ని సంప్రదిస్తాడు. ఊర్మిళను ప్రేమించిన మాట వాస్తవం, అయితే ఆమెను నేను చంపలేదు అంటూ రామచంద్రానికి చెప్తాడు. ఈ కేసును రామచంద్రన్ టేక్ అప్ చేస్తాడు. చివరికి రామచంద్రన్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతాడా? ఈ కేసును సాల్వ్ చేస్తాడా? మరిన్ని కేసులు రామచంద్రన్ పరిష్కరిస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘సిఐడి రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ’ (CID Ramachandran Retd. SI) మూవీని మిస్ కాకుండా చూడండి.