OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో సాయికుమార్ ప్రధాన పాత్రలో పోషించిన ఒక మూవీ, మంచి మెసేజ్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఒక చిన్న పాప తన తల్లి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ట్విస్టులతో సాగిపోయే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…
ఆహా (aha) లో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘మెర్సి కిల్లింగ్‘ (Mercy killing). 2024 లో విడుదలైన ఈ తెలుగు సినిమాకి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించారు. సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల ఈ సినిమాను నిర్మించారు. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య ఉల్లింగల, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 ఏప్రిల్ 12న విడుదల చేశారు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
స్వేచ్ఛ అనే అమ్మాయి మెర్సీ కిల్లింగ్ అనే ఫ్లాగ్ పట్టుకొని నిరసన చేస్తుంది. ఈమె అనాధ కావడంతో వీడియో వైరల్ అవుతుంది. రామకృష్ణ అనే వ్యాపారి కూడా ట్విట్టర్లో ఆమెకు సానుభూతి పలుకుతాడు. నయం కాని జబ్బులు ఉన్నవాళ్లకి, మెర్సీ కిల్లింగ్ ద్వారా ప్రభుత్వం చనిపోవడానికి అనుమతిని ఇస్తుంది. ఈ క్రమంలోనే తన తల్లి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది స్వేచ్ఛ. తను అనాధ శరణాలయానికి ఎలా వచ్చిందో తెలుసుకుంటుంది. ఆమె పుట్టిన హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వయిరీ చేస్తుంది. ఆమె తల్లి పేరు భారతి అని తెలుసుకుంటుంది. భారతి ఊరి తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారించగా, ఆమె గురించి ఎవరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. ఇంతలో మహేష్ అనే వ్యక్తి స్వేచ్ఛ దగ్గరికి వచ్చి భారతి గురించి విషయాలు చెప్తాడు. భారతి, మహేష్ కి మరదలు కావడంతో ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడతారు. తల్లిదండ్రులు కూడా వీళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు.
అయితే అనుకోకుండా ఒక రోజు భారతి గాయాలతో ఇంటికి వస్తుంది. ఇది చూసిన భారతి తండ్రి మహేష్ ని నాలుగు రోజుల తర్వాత వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇంతలో భారతికి మరొకరితో పెళ్లి అయిపోతుంది. ఆ వ్యక్తులు భారతిని బాగా టార్చర్ పెడుతూ ఉంటారు. అక్కడినుంచి భారతి తప్పించుకుని వెళ్ళిపోతుంది. మహేష్ ఇంటికి నాలుగు రోజుల తర్వాత వస్తాడు. భారతి ఆ మరుసటి రోజు వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని టీవీలో ప్రసారమవుతుంది. అప్పటినుంచి భారతి కనిపించకుండానే పోతుంది. ఈ విషయం స్వేచ్ఛకి చెప్తాడు మహేష్. ఇందులో రహస్యాలను బయటకు తీయాలనుకుంటుంది స్వేచ్ఛ. ఈ క్రమంలో స్వేచ్ఛకి తన తండ్రి తో పాటు, దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. చివరికి స్వేచ్ఛ బయట పెట్టిన విషయాలు ఏమిటి? తన తండ్రి గురించి ఎలా తెలుసుకుంటుంది? తన తల్లి భారతి మీద ఆ నింద ఎందుకు వేశారు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘మెర్సి కిల్లింగ్’ (Mercy killing) మూవీని మిస్ కాకుండా చూడండి.