OTT Movies : ఇటీవల ఓటీటీల్లో కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు విడుదల అవుతుంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సమయంలోనే అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి కూడా వచ్చేస్తాయి.. అయితే చిన్న సినిమాలు మాత్రం కాస్త ఆలస్యంగానే స్ట్రీమింగ్ కి వస్తాయి. అలాగే కొన్ని సినిమాలు అయితే ఏకంగా సంవత్సరాల తర్వాత ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఓ సినిమా అలాగే ఓటిటిలోకి రాబోతుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ మనం చూడొచ్చో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మూవీ..
ఈమధ్య థియేటరలలోకి వచ్చిన తెలుగు సినిమాలు అన్ని కూడా ఓటీటీలోకి వచ్చేస్తాయి.. కొన్ని సినిమాలు ఏవో మాత్రమే ఆలస్యంగా స్ట్రీమింగ్ వస్తుంటాయి.. అయితే ఎక్కువగా చిన్న సినిమాలు మాత్రం కాస్త ఆలస్యంగానే ఓటీటీ లోకి వచ్చేస్తాయి.. ఇప్పుడు ఓ తెలుగు సినిమా చాలా నెలల తర్వాత డిజిటల్ ప్లాట్ఫారం లోకి రిలీజ్ కాబోతుంది.. ఆ సినిమా పేరు ‘సినిమా పిచ్చోడు’.. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆ మూవీ స్టోరీ కొత్తగా ఉన్నా థియేటర్లలో జనాలను మెప్పించలేకపోతుంది. ప్రస్తుతం ఓ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ..
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. ఇక ఈ వారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2 వంటి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి..
Also Read :జూన్ లో థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు..విన్నర్ ఎవరు..?
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీలో జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. అయితే ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుందా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే.. అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆసక్తి కనబరుస్తుంది.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకు ఓటీటీల్లో మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి… కొత్త సినిమాలు కలెక్షన్స్ ను స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నాయి.. ఇక జూన్ లో కొత్త సినిమాలు బోలెడు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి..