Upcoming Movies In June : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినెలా కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి.. అలాగే ఈ నెల కూడా బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు మాత్రం మంచి టాక్ ని అందుకున్నాయి. ముఖ్యంగా మే ఒకటో తారీకు న రిలీజ్ అయిన నాని, సూర్య సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇక మే 9న రిలీజ్ అయిన సింగిల్ , అతిలోకసుందరి సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ ని కూడా అందుకుంటున్నాయి. ఈ నెల చివర్లో కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. జూన్ లో కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. అందులో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు జూన్లో రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి ఓసారి తెలుసుకుందాం..
జూన్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..
గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదు. జూన్ నెలలో కేవలం మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. దానికి ఆ సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వాలి. పహల్గామలో జరిగిన ఉగ్రదాడి వల్ల ఆ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో జూన్లో ఈ సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.. జూన్ 13వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది.. అదేవిధంగా జూన్ 20న నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో రాబోతున్న కుబేర సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. చివరగా మంచు విష్ణు నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ మూడు సినిమాలు కొద్ది రోజులు ఎవరిలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఈ సినిమాల గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..
హరిహరవీరమల్లు..
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ జాగర్లపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఎం ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. మూవీ భారీ అంచనాలతో జూన్ 13న థియేటర్లలోకి రాబోతుంది..
కుబేర..
హీరో ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు… ఈ మూవీ జూన్ 20న విడుదల కాబోతుంది..
Also Read : ‘వీరమల్లు’ వీరకుమ్ముడు.. భారీ ధరకు ఓటీటీ రైట్స్.. రిలీజ్ కు ముందే హిట్..
కన్నప్ప..
టాలీవుడ్ నటుడు విష్ణు మంచు తన హై-బడ్జెట్ పౌరాణిక ఇతిహాసం ‘కన్నప్ప’ జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఇందులో ముఖేష్ రిషి, శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, మధు, ఐశ్వర్య భాస్కరన్, ప్రీతి ముకుందన్, సప్తగిరి, సంపత్, దేవరాజ్, శివ బాలాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విష్ణు మంచు తన అవా ఎంటర్టైన్మెంట్ కింద మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై నిర్మించారు..
మొత్తానికైతే జూన్ నెలలో భారీ బడ్జెట్ చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి.. మరి ఏ సినిమాకు ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి…