BigTV English

OTT Movie : ఈ అబ్బాయి జోలికొస్తే ఉతికి ఆరేసే ఏలియన్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు…. క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ఈ అబ్బాయి జోలికొస్తే ఉతికి ఆరేసే ఏలియన్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు…. క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : లైట్ హార్టెడ్, ఎమోషనల్, ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ కాసేపు సరదాగా నవ్వుకునే సినిమాలు ఇటీవల కాలంలో బాగా తగ్గాయి. ఎలాగూ ఓటీటీలలో లెక్కలేనన్ని సినిమాలు ఉంటాయి, అందులో వెతుక్కుందాం అనుకుంటే… సముద్రంలో ఇసుక రేణువును వెతికినట్టే ఉంటుంది. అలా ఫ్యామిలీ జానర్ లో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చూడగలిగే సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు ‘CJ7’. 2008లో వచ్చిన ఈ హాంగ్ కాంగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామాలో ఒక పేద కుటుంబంలోని తండ్రి-కొడుకుల మధ్య నడిచే ఎమోషనల్ స్టోరీ, ఒక గ్రహాంతర జీవి ద్వారా వారి జీవితంలో వచ్చే మార్పుల గురించి ఉంటుంది. ఈ చిత్రంలో హాస్యం, భావోద్వేగం, ఫాంటసీ వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. సమాజంలోని పేదరికం, కలల గురించి ఆలోచింపజేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్, కామెడీ, ఫామిలీ డ్రామా, ఫాంటసీ ఉన్న మిక్స్డ్ సినిమా. అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది ఈ మూవీ. అలా మూవీని చూసి నవ్వుకోవడంతో పాటు ఎమోషనల్ కూడా అవుతారు. ఈ సినిమా Netflix, Amazon Prime Videoలలో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే…

చౌ టి (స్టీఫెన్ చౌ) ఒక పేద కన్‌స్ట్రక్షన్ వర్కర్, తన కొడుకు డికీ (జూ జియావో)తో కలిసి ఒక శిథిలమైన ఇంట్లో జీవిస్తాడు. డికీ ఒక ఖరీదైన ప్రైవేట్ స్కూల్‌లో చదువుతాడు. ఎందుకంటే టి తన కొడుకుకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటాడు. కానీ డికీని స్కూల్‌లో తన పేదరికం వల్ల సహవిద్యార్థులు ఎగతాళి చేస్తారు. ఆ చిన్న పిల్లాడు దాన్నేమీ పెద్దగా పట్టించుకోడు. ఓరోజు డికీ ఒక ఖరీదైన బొమ్మ “CJ1″ను కొనివ్వమని తండ్రిని అడుగుతాడు. కానీ డబ్బులు లేక టి దానిని కొనలేకపోతాడు.

ఒక రోజు టికి ఒక చెత్త డంప్‌లో వింత ఆకుపచ్చ బంతి కన్పిస్తుంది. దానిని తీసుకొచ్చి, డికీకి బొమ్మగా ఇస్తాడు. ఆ బంతి నిజానికి ఒక ఏలియన్. దీనిని డికీ “CJ7” అని పిలుస్తాడు. అదొక అందమైన, రబ్బర్‌ లాంటి జీవి. ఇది త్వరగానే డికీకి స్నేహితుడిగా మారుతుంది. అతని జీవితాన్ని మార్చడానికి విచిత్రమైన శక్తులను ఉపయోగిస్తుంది. డికీ ఈ ఏలియన్ ద్వారా స్కూల్‌లో సూపర్‌ హీరో అవ్వాలని అనుకుంటాడు. కానీ దాని శక్తులు కామెడీగా, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. దీంతో డికీ స్కూల్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటాడు.

మరోవైపు టి తన బాస్, సహోద్యోగులతో గొడవలు పడతాడు. ఒక రోజు టి కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఒక దుర్ఘటనలో చనిపోతాడు. డికీని ఒంటరిగా వదిలేస్తాడు. ఆ ఏలియన్ డికీ బాధను చూసి, తన శక్తులను ఉపయోగించి టిని తిరిగి జీవింపజేస్తుంది. ఈ ప్రక్రియలో ఆ ఏలియన్ తన శక్తులను కోల్పోయి, ఒక సాధారణ బొమ్మగా మారుతుంది. మరి బొమ్మగా మారిన ఆ ఏలియన్ తిరిగి ఎలా జీవం పోసుకుంది? చివరికి కథ సుఖాంతం అయ్యిందా ? లేక విషాదంగా ముగిసిందా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : వర్షం పడిన రాత్రి… అజ్ఞాత వ్యక్తితో ఇద్దరమ్మాయిల అరాచకం… మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×