OTT Movie : ప్రయోగాత్మక కథలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. కానీ ఆ ప్రయోగాలు హద్దు దాటితేనే వివాదాస్పదం అవుతాయి. అలాంటి ఓ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ గురించి ఈరోజు మూవీ సజెషన్లో చెప్పుకుందాం. కాంట్రవర్సీ మాత్రమే కాదు అసహ్యకరమైన మూవీ కూడా బహుశా ఇదేనేమో. ఇందులోని సన్నివేశాలు అత్యంత ఘోరంగా ఉంటాయనేది చూసేవాళ్ళు చెప్పే మాట. కాబట్టి ఎలాంటి దారుణమైన సీన్స్ ను అయినా సరే చూసి తట్టుకునే శక్తి ఉంటేనే ఈ మూవీని చూసే ధైర్యం చేయండి. లేదంటే స్కిప్ చేయడం బెటర్.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘The Human Centipede’. 2009లో రిలీజ్ అయిన డచ్ సైకలాజికల్ హారర్ సినిమా. ఈ మూవీ కథ ఒక విచిత్రమైన డాక్టర్ చేసే భయంకరమైన ప్రయోగం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులను శస్త్రచికిత్స ద్వారా కలిపి, ఒకే జీర్ణవ్యవస్థతో “హ్యూమన్ సెంటిపీడ్” అనే జీవిని సృష్టించే ప్రయోగం చేస్తాడు ఆ సైకో డాక్టర్. జానర్ పరంగా ఇది బాడీ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, గ్రాస్-అవుట్ హారర్ కలిసిన సినిమా. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా షాకింగ్, భయంకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇది అసహ్యకరమైన సన్నివేశాలతో నిండి ఉంటుంది. ఈ సినిమా గ్రాస్-అవుట్ కాన్సెప్ట్ వల్ల చాలా వివాదాస్పదమైంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
లిండ్సే (ఆష్లే సి. విలియమ్స్), జెన్నీ (ఆష్లిన్ యెన్నీ) అనే ఇద్దరు అమెరికన్ అమ్మాయిలు జర్మనీలో ఉంటారు. వెకేషన్ టైంలో రోడ్ ట్రిప్‌లో ఉంటారు. వారి కారు అడవిలో పాడైపోతుంది. సహాయం కోసం దగ్గరలో ఉన్న ఒక విల్లాకు వెళ్తారు. అక్కడ వారిని డాక్టర్ జోసెఫ్ హీటర్ (డైటర్ లేసర్) అనే వృద్ధుడు ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. హీటర్ ఒక రిటైర్డ్ సర్జన్, గతంలో అతుక్కుని పుట్టిన కవల పిల్లలను (Siamese twins) విడదీసే నిపుణుడు. కానీ ఇప్పుడు అతను విచిత్రమైన ఆలోచనలతో ఉన్నాడు.
అతను లిండ్సే, జెన్నీలకు మత్తు మందు ఇచ్చి, వారిని తన బేస్‌మెంట్‌లోని రహస్య ఆసుపత్రిలో బంధిస్తాడు. అతను కాట్సురో (అకిహిరో కిటమురా) అనే జపనీస్ టూరిస్ట్‌ను కూడా కిడ్నాప్ చేసి అక్కడే ఉంచుతాడు. ఇక వీళ్లకు హీటర్ తన భయంకరమైన ప్రయోగం గురించి చెబుతాడు: ముగ్గురినీ కలిపి కుట్టేసి, ఒకే జీర్ణవ్యవస్థతో కలిపి “హ్యూమన్ సెంటిపీడ్” సృష్టించాలని.హీటర్ తన ఆపరేషన్ ను ప్రారంభిస్తాడు,
Read Also : బిజినెస్ మీటింగ్ లో పెళ్ళైన వ్యాపారవేత్త రాసలీలలు… క్లైమాక్స్ లో దిమ్మతిరిగే ట్విస్ట్
కాట్సురోను మొదటి స్థానంలో, లిండ్సేను మధ్యలో, జెన్నీని చివరిలో కుట్టి కలుపుతాడు. వీళ్ళు నడవకుండా పాకేలా కాళ్ళను కూడా కుట్టేస్తాడు. తరువాత హీటర్ వారిని తన “పెంపుడు జంతువు”లా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ లిండ్సే తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. జెన్నీ బ్లడ్ పాయిజనింగ్ తో బాధపడుతుంది. కాట్సురో తన గత జీవితం గురించి బాధపడతాడు. ఒకానొక టైంలో పోలీసులు హీటర్ ఇంటికి వస్తారు. అప్పుడు ఈ డాక్టర్ ఏం చేశాడు? చివరికి ఈ దరిద్రమైన ప్రయోగం నుంచి ఆ ముగ్గురిలో ఒక్కరైనా తప్పించుకోగలిగారా? ఒకవేళ తప్పించుకుంటే బ్రతికి బయట పడ్డారా లేదా ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మూవీలో చూడలేని సీన్స్ ఉన్నాయన్న విషయం అస్సలు మర్చిపోవద్దు.