BigTV English

OTT Movie : బీచ్ ఒడ్డున డెడ్ బాడీ… ఆ అమ్మాయి శవం చుట్టే మిస్టరీ అంతా… పోలీసులకు చెమటలు పట్టించే కేసు

OTT Movie : బీచ్ ఒడ్డున డెడ్ బాడీ… ఆ అమ్మాయి శవం చుట్టే మిస్టరీ అంతా… పోలీసులకు చెమటలు పట్టించే కేసు
Advertisement

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అసలే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలకు పేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. మీరు కూడా ఈ జానర్ సినిమాల ప్రేమికులైతే ఈ అదిరిపోయే మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.


అమ్మాయి శవం చుట్టే కథంతా…

ఈ మూవీ పేరు ‘Lara’. 2025లోనే రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్. కారైక్కాల్ బీచ్‌లో కనిపించిన గుర్తు తెలియని మహిళ శవం చుట్టూ జరిగే ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కథ ఇది. ఈ మూవీ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, సైకలాజికల్ డ్రామా, మిస్టరీ కలగలిసిన మూవీ. ఇందులో కావాల్సినన్ని ట్విస్ట్‌లు, నరాలు తెగే సస్పెన్స్ ఉంటుంది. ఈ ఏడాది జనవరి 3నే థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ Tentkotta అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు: మణి మూర్తి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో అశోక్ కుమార్ బాలకృష్ణన్ (మహరూఫ్), ఎం. కార్తీకేసన్ (ఇన్‌స్పెక్టర్ కార్తీకేసన్), అనుశ్రీ రాజన్ (లారా), వర్షిణి వెంకట్, వెన్మతి, మాథ్యూ వర్గీస్ (ఎమ్మెల్యే), బాల (లారెన్స్) ప్రధాన పాత్రలు పోషించారు.


కథలోకి వెళ్తే…

కారైక్కాల్ బీచ్‌లో ఒక గుర్తు తెలియని మహిళ శవం, పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపిస్తుంది. ఇన్‌స్పెక్టర్ కార్తీకేసన్ (ఎం. కార్తీకేసన్) ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. శవం ఎవరిది? ఆమె ఎలా చనిపోయింది? హంతకుడు ఎవరు? అనే ప్రశ్నలతో అతని దర్యాప్తు మొదలవుతుంది. సీసీటీవీ ఫుటేజీలో అచ్చం ఈ అమ్మాయి లాంటి దుస్తులు ధరించిన మహిళ కనిపిస్తుంది. దాని ద్వారా ఆమె లారా (అనుశ్రీ రాజన్) అని తెలుసుకుంటారు. కానీ లారా ఎవరు? ఆమె అలాంటి పనులు చేసే అమ్మాయి కావచ్చు లేదా ఆమెకు గతంలో ఆయుధాల స్మగ్లింగ్‌తో సంబంధం ఉందా? అనే సందేహాలు తలెత్తుతాయి.

ఈ దర్యాప్తులో, ఒక ఎమ్మెల్యే (మాథ్యూ వర్గీస్), అతని కొడుకు మహరూఫ్ (అశోక్ కుమార్ బాలకృష్ణన్), కౌన్సిలర్ డ్రైవర్ లారెన్స్ (బాల) వంటి వారిని విచారిస్తారు, వీళ్ళందరికీ సీక్రెట్స్ ఉంటాయి. కార్తీకేసన్ దర్యాప్తు ముందుకు సాగుతున్నప్పుడు, లారెన్స్ భార్య గురించి సందేహాస్పద సమాచారం బయట పడుతుంది. ఆమె మిస్ అయినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే తన పొలిటికల్ పవర్ ను ఉపయోగించి, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు ఈ ఎమ్మెల్యే, అతని కొడుకుతో ఏంటి సంబంధం ? లారెన్స్ భార్య ఎలా మిస్ అయ్యింది ? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

Read Also : కొత్త ఇంట్లో ఊహించని ఝలక్… హారర్ సీన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×