E-Paper
Advertisement

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ
Advertisement

Crime Drama Series: స్నేహం ఎంతటి బలమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అదే స్నేహంలో తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం కూడా జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చెప్పే పాయింట్‌తో రూపొందిన క్రైమ్ డ్రామా సిరీస్ ‘చార్ యార్’ (Char Yaar Hindi Web Series). ఈ సిరీస్ ఇరవయ్యో శతాబ్దపు బ్యాక్‌డ్రాప్‌లో మధ్యతరగతి కుర్రాళ్ల కలలు, ఆశయాలు, వాటి కోసం వారు చేసే సాహసాల నేపథ్యంలో సాగుతుంది. మరి ఈ ఫ్రెండ్షిప్ క్రైమ్ కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఏ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జే, టోనీ, సాహిల్, సమీర్ నలుగురు స్నేహితులు. ఈ నలుగురు మధ్యతరగతి కుర్రాళ్ళు జీవితంలో త్వరగా పైకి రావాలని, ఏ కష్టం లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడతారు. ఆ కోరికలే వారిని అడ్డదారులు, షార్ట్‌కట్ దారులు వెతికేలా చేస్తాయి.
కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కడం కంటే త్వరగా డబ్బు సంపాదించి తమ పరిస్థితులను మార్చుకోవాలని వాళ్ళు భావిస్తారు. ఒక అత్యవసర పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం వారిని కారు దొంగతనాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మొదట తమ సమస్యలకు ఇదొక పరిష్కారమని భావించిన ఆ స్నేహితులకు, తాము అడుగుపెట్టింది ఎంత ప్రమాదకరమైన దారో క్రమంగా అర్థమవుతుంది.

Advertisement

వారు చేసిన పని మాఫియా గ్యాంగ్‌ ల దృష్టిలో పడటంతో సమస్యలు మరింత పెరుగుతాయి. బబ్బన్, నాగ్రే గ్యాంగ్ వంటి ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ దొంగతనాల వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు మొదలుపెడతారు. అబూ ఖాసిమ్ వ్యవహారం, గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

డబ్బు సంపాదించేందుకు మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. అయితే ప్రతి అవకాశం వెనుక మరో ప్రమాదం దాగి ఉంటుంది. తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే ప్రయత్నం కూడా వారిని సమస్యల నుంచి బయట పడేయదు. గ్యాంగ్‌ల మధ్య గొడవలు, పోలీసుల నిఘా, అనుకోని దొంగతనాలు వారి జీవితాలను మరింత ప్రమాదంలోకి నెడతాయి.

Advertisement

ఒక దశలో వారి మధ్య ఉన్న నమ్మకం కూడా దెబ్బతింటుంది. చివరకు వారి ఆప్తులు కిడ్నాప్ కావడంతో నలుగురు స్నేహితులకు మరో పెద్ద షాక్ తగులుతుంది. తమను తాము కాపాడుకోవడంతో పాటు, తమ వాళ్లను రక్షించుకోవడానికి మళ్లీ ఒక్కటవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఉచ్చు నుంచి ఆ నలుగురు ఫ్రెండ్స్ ప్రాణాలతో ఎలా బయటపడ్డారు ? వారి స్నేహం ఆ కష్టాల తుఫాన్‌ను ఎలా ఎదుర్కొంది ? అనే అంశాలను ఎంతో భావోద్వేగంగా, ఊహించని ట్విస్టులతో ఈ సిరీస్‌లో మలిచారు మేకర్స్.

ఏ ఓటీటీలో ఉంది ?

‘చార్ యార్’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అక్టోబర్ 23న విడుదలైంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉన్న ఈ క్రైమ్ డ్రామా ప్రస్తుతం హిందీ ఆడియోలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. పురవ్ ఝా, నామన్ జైన్, సాకిబ్ అయూబ్, ప్రైరాక్ మెహతా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు వినయ్ వైకుల్ (Vinay Waikul) దర్శకత్వం వహించారు. కామెడిగా సాగే క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకుంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు.

Read Also: సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

Related News

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

పిజ్జా షాప్‌లో పిచ్చి బాస్… ఈ కుర్రాళ్ల లైఫ్ చూస్తే మీ యంగ్ ఏజ్ గుర్తొస్తుంది భయ్యా… కొత్త కామెడీ సిరీస్

ఫ్యాషన్ డిజైనర్ కావాలని సిటీకి… కట్ చేస్తే కథ రివర్స్… ఎమోషనల్ మూవీ

Big Stories

Advertisement
×