E-Paper
Advertisement

ఓడలో అమ్మాయిలనే టార్గెట్ చేసే కిల్లర్… 2000ల మందిలో హంతకుడు ఎవరు ?

ఓడలో అమ్మాయిలనే టార్గెట్ చేసే కిల్లర్… 2000ల మందిలో హంతకుడు ఎవరు ?
Advertisement

French Mystery Thriller Series: సముద్రం మధ్యలో కదులుతున్న ఒక భారీ సైనిక నౌకలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కిన మైండ్ బ్లోయింగ్ ఫ్రెంచ్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆర్ 91’ (R91). ఈ సిరీస్ సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్‌లను ఇష్టపడేవారికి ఒక విజువల్ ఫీస్ట్ లాంటిది. సముద్రం మధ్యలో సాగిపోయే యుద్ధనౌకలో జరిగే హత్యలు, కనిపించకుండా పోయే వ్యక్తులు, అంతుచిక్కని ఆధారాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. మరి ఈ అద్భుతమైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఓటీటీ మూవీ లవర్స్ ఎక్కడ చూడవచ్చు ?అనేది తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఫ్రాన్స్‌ కు చెందిన చార్లెస్ డి గాల్ యుద్ధనౌక తూర్పు మధ్యధరా సముద్రంలో ఒక కీలక సైనిక మిషన్ కోసం బయలుదేరుతుంది. ఈ నౌకలో సుమారు 1,800 మంది అబ్బాయిలు, 240 మంది మహిళలు ఉంటారు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో ఓ మహిళా సిబ్బంది హత్యకు గురవుతుంది. అదే సమయంలో మరో మహిళ కనిపించకుండా పోవడంతో నౌకలో కలకలం మొదలవుతుంది. పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నా, సైనిక మిషన్‌ ను ఆపకుండా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.

Advertisement

ఈ కేసును ఛేదించేందుకు సైనిక దర్యాప్తు అధికారి పాల్ ఫిషర్‌ ను అత్యవసరంగా నౌకపైకి పంపిస్తారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోవడం, అనుమానితులను సులభంగా విడిగా ప్రశ్నించడం అక్కడ సాధ్యం కాదు. నౌకలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు కనిపించినా, అది దర్యాప్తులో కీలకమైన ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.

ఇంతలో మరో మృతదేహం బయట పడటంతో కేసు మరింత ఇంటెన్స్ గా మారుతుంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా, లేక నౌకలోని అంతర్గత విభేదాలకు ఈ హత్యలతో సంబంధం ఉందా అనే అనుమానాలు మొదలవుతాయి. ఒకవైపు నౌకలోని సిబ్బంది భయాందోళనలకు గురవుతుంటే, మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన మిషన్‌ ను కొనసాగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఈ రెండు పరిస్థితుల మధ్య దర్యాప్తు చేయడం పాల్ ఫిషర్‌కు పెద్ద పరీక్షగా మారుతుంది.

Advertisement

అనుమానితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, నిజాన్ని దాచిపెట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారనే ప్రశ్న మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. నౌకలోని ప్రతి విభాగం, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటనపై దర్యాప్తు అధికారి దృష్టి పెట్టాల్సి వస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు కేవలం ఒక క్రైమ్ కేసుకే పరిమితం కావు. వాటి ప్రభావం సైనిక మిషన్‌పై కూడా పడే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరో అసలు నేరస్థుడిని గుర్తించి, మరిన్ని ప్రాణాలు పోకుండా ఆపగలడా ? అనేదే కథలో చూడాల్సిన అసలు విషయం.

తెలుగులో డబ్బింగ్ ఉందా ?

‘ఆర్ 91′(Le Charles) ఫ్రెంచ్ మిస్టరీ క్రైమ్ సిరీస్. మొదటి సీజన్‌ లో ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. అక్టోబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదలైంది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఎలోడీ యుంగ్ (Élodie Yung), అల్బన్ లినోయిర్ (Alban Lenoir), పాట్రిక్ మిల్లె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు జూలియన్ డెస్‌పాక్స్ (Julien Despaux) దర్శకత్వం వహించారు.

Read Also: కాళీ శాపం… పాముకాట్లతో వరుస మరణాలు… మైండ్ బ్లాక్ చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా?

Related News

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

 ఎమ్మెల్యే కూతురితో ప్రేమ… తుపాకి మోతలతో రక్తపాతం… అమెజాన్ ప్రైమ్‌లో రచ్చ లేపుతున్న కొత్త క్రైమ్ సిరీస్

స్మార్ట్‌ఫోన్లో చిక్కుకుపోయే సీఈవో… ఊహించని ట్విస్టులతో సాగే కొరియన్ థ్రిల్లర్

కాళీ శాపం… పాముకాట్లతో వరుస మరణాలు… మైండ్ బ్లాక్ చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా?

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

Big Stories

Advertisement
×