E-Paper
Advertisement

 ఎమ్మెల్యే కూతురితో ప్రేమ… తుపాకి మోతలతో రక్తపాతం… అమెజాన్ ప్రైమ్‌లో రచ్చ లేపుతున్న కొత్త క్రైమ్ సిరీస్

 ఎమ్మెల్యే కూతురితో ప్రేమ… తుపాకి మోతలతో రక్తపాతం… అమెజాన్ ప్రైమ్‌లో రచ్చ లేపుతున్న కొత్త క్రైమ్ సిరీస్
Advertisement

Action Thriller OTT: ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో వైలెంట్ యాక్షన్, పొలిటికల్ క్రైమ్ డ్రామాల జోరు గట్టిగా నడుస్తోంది. అలాంటి రస్టిక్ జోనర్‌ లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై వ్యూవర్స్‌ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘దునియా కీ థైన్ థైన్’ (Duniya Ki Thain Thain). ఈ సిరీస్ కథ పవర్, పాలిటిక్స్, అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తూ ప్రేక్షకులకు ఒక రా అండ్ రస్టిక్ ఫీలింగ్‌ను పంచుతుంది. మరి యాక్షన్ మూవీ లవర్స్ కోసం ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

శక్తిపూర్ అనే గ్రామంలో వికాస్ కుమార్ అనే యువకుడు ఉంటాడు. అతను మంచి షూటర్. జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది అతని కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతని లక్ష్యానికి అడ్డంకిగా మారుతుంటాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే బ్రిజ్‌భన్ చతుర్వేది కుమార్తె వైష్ణవితో వికాస్‌ కు పరిచయం ఏర్పడుతుంది. వైష్ణవికి షూటింగ్ నేర్పించే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే రాజకీయ ఆధిపత్యం కోసం చతుర్వేదీలు, ఠాకూర్ కుటుంబాల మధ్య ఉన్న పాత విభేదాలు వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి.

Advertisement

వైష్ణవిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వికాస్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె కుటుంబం కూడా అతని ప్రతిభను గుర్తించి వైష్ణవికి షూటింగ్, ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను వికాస్‌ కు అప్పగిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతున్న సమయంలో కుటుంబాల మధ్య రాజకీయ పోరు తీవ్రరూపం దాలుస్తుంది. ప్రేమను వదులుకోవాలంటూ వికాస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కానీ అతను వైష్ణవికి దూరంగా ఉండలేకపోతాడు.

ఇక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. వైష్ణవి కిడ్నాప్ కావడంతో ఆమెను కాపాడేందుకు వికాస్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో కాల్పులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. చివరకు హత్య కేసులో వికాస్ అరెస్టవుతాడు. అతడికి వ్యతిరేకంగా వైష్ణవి కోర్టులో సాక్ష్యం చెప్పడంతో, వికాస్ కి జీవిత ఖైదు పడుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి తనకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పిందో అర్థంకాక వికాస్ తీవ్రంగా కుంగిపోతాడు.

Advertisement

ఐదేళ్ల తర్వాత కథ మరో టర్న్ తిరుగుతుంది. ఒకప్పుడు షూటర్‌ గా ఎదగాలని కలలు కన్న వికాస్ ఇప్పుడు విక్కీ భయ్యాగా మారి శక్తిపూర్‌ ను ఏలుతాడు. మరోవైపు వైష్ణవి పోలీసు అధికారిణిగా మారి అక్కడి మాఫియాపై చర్యలు తీసుకుంటుంది. దీంతో ఒకప్పుడు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు శత్రువులుగా నిలబడాల్సి వస్తుంది. పాత ప్రేమ, నమ్మకద్రోహం, కుటుంబాల మధ్య పగలు, రాజకీయ కుట్రలు వీరి జీవితాలను మళ్లీ కలుపుతాయి. అసలు వికాస్‌ ను జైలుకు పంపించిన పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు ? వైష్ణవి ఎందుకు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ? శక్తిపూర్‌లో అధికారాన్ని శాసిస్తున్న వారి అసలు లక్ష్యం ఏమిటన్నది కథలో ఉత్కంఠను పెంచుతుంది.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘దునియా కీ థైన్ థైన్’ అక్టోబర్ 22 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌ (MX Player)లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లోనూ ఈ సిరీస్‌ను చూడొచ్చు. ప్రస్తుతం ఈ హిందీ సిరీస్ హిందీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. రిషబ్ జైస్వాల్, దిపాలి శర్మ, రవి సాహ్, మాన్సీ పాండే ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిరీస్‌కు సుమిత్ చావ్లా (Sumit Chawla) దర్శకత్వం వహించారు.

Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

Related News

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

స్మార్ట్‌ఫోన్లో చిక్కుకుపోయే సీఈవో… ఊహించని ట్విస్టులతో సాగే కొరియన్ థ్రిల్లర్

కాళీ శాపం… పాముకాట్లతో వరుస మరణాలు… మైండ్ బ్లాక్ చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా?

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

Big Stories

Advertisement
×