E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్లో చిక్కుకుపోయే సీఈవో… ఊహించని ట్విస్టులతో సాగే కొరియన్ థ్రిల్లర్

స్మార్ట్‌ఫోన్లో చిక్కుకుపోయే సీఈవో… ఊహించని ట్విస్టులతో సాగే కొరియన్ థ్రిల్లర్
Advertisement

Korean Mystery Thriller: కొరియన్ డ్రామాలు అనగానే మనకు కేవలం క్యూట్ లవ్ స్టోరీలు, రొమాంటిక్ సీన్స్‌ ఠక్కున గుర్తుకొస్తాయి. కానీ ఆ ట్రెండ్‌ కు రామ్ రామ్ చెప్పే కొత్త కథలు ఇప్పుడిప్పుడే కొరియన్ మూవీ లవర్స్ కు చేరువ అవుతున్నాయి. మిస్టరీ, హై-వోల్టేజ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అన్‌లక్కీ మై బాస్’ (Unlock My Boss) కూడా ఆ లిస్ట్ ఉంటుంది. మనం ప్రతీరోజూ ఎంతో ఇష్టంగా చేతిలో పట్టుకునే స్మార్ట్‌ఫోన్ లోపల ఒక పెద్ద ఐటీ కంపెనీకి చెందిన సీఈవో ప్రాణం చిక్కుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. డిజిటల్ యుగంలో టెక్నాలజీ మనుషులను ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తుందో ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఉందా ? అనే డీటైల్స్ లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ఉద్యోగం లేక రోజూ ఖాళీగా తిరిగే ఒక యువకుడికి అనుకోకుండా ఒక రోజు అత్యంత ఖరీదైన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌ ను ఆన్ చేసి చూసేసరికి అతనికి ఒక భారీ టెక్ కంపెనీకి చెందిన సీఈవో నుంచి ఊహించని ఫోన్ కాల్ వస్తుంది. తాను కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాను అని, తన ప్రాణం ఆ ఫోన్‌లో బందీగా ఉందని, తనను ఆ గండం నుంచి కాపాడి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని ఆ సీఈవో సదరు కుర్రాడిని వేడుకుంటాడు. అలా ఒక సామాన్య యువకుడు ఆ టెక్ దిగ్గజ సంస్థకు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపడతాడు.

Advertisement

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పార్క్ ఇన్-సంగ్ అనే నిరుద్యోగ యువకుడి జీవితంలోకి వచ్చిన ఈ ఫోన్ అతడికి ఉద్యోగం మాత్రమే కాదు, ఊహించని బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. ఫోన్‌ లో ఉన్న కిమ్ సన్-జూ చెప్పినట్లు కంపెనీ పగ్గాలు చేపట్టిన ఇన్-సంగ్‌ కు కార్పొరేట్ ప్రపంచంలోని అసలు ఆట అప్పుడే అర్థమవుతుంది. బయటకు అంతా సవ్యంగా కనిపించినా, కంపెనీ లోపల అధికారం కోసం జరిగే పోటీలు, వ్యక్తిగత ప్రయోజనాలు, రహస్య ఒప్పందాలు అతడిని ప్రమాదంలోకి నెడతాయి.

మరోవైపు సీఈవోకు నమ్మకమైన కార్యదర్శి జంగ్ సె-యోన్ కూడా ఈ వ్యవహారంపై అనుమానాలు పెంచుకుంటుంది. సన్-జూ కనిపించకుండా పోవడం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఆమె తనదైన శైలిలో దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇన్-సంగ్, సె-యోన్ కలిసి ఆధారాలను వెతుకుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడతాయి. తమకు ఎదురవుతున్న ప్రతి సమస్య వెనుక ఎవరో ఒకరు ఉన్నారనే అనుమానం బలపడుతుంది. చివరకు సన్-జూపై దాడి చేసింది ఎవరు ? అతడిని ఫోన్‌లో బందీ చేసిన పరిస్థితుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అసలు ఆ సీఈవో ఆ దుస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఏమిటి ? ఆయన వెనుక ఉన్న శత్రువులు, మోసగాళ్లు ఎవరు ? ఈ ఇద్దరూ కలిసి ఆ హంతకులను ఎలా కనిపెట్టారనే అంశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘అన్‌లక్కీ మై బాస్’ సిరీస్ జీ5 (ZEE5)లో అందుబాటులో ఉంది. కానీ తెలుగు ఆడియో కావాలంటే సిరీస్ ను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో చూడాలి. 2022 డిసెంబర్ 7న ఒరిజినల్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారమైన ఈ సిరీస్, 2025 అక్టోబర్ 21 నుంచి జీ5 ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ నటులు చా జోంగ్-హ్యోప్ (Chae Jong-hyeop), సో ఎన్-సూ (Seo Eun-soo), పార్క్ సుంగ్-ఉంగ్ (Park Sung-woong) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు లీ చుల్-హా (Lee Chul-ha) దర్శకత్వం వహించారు.

Read Also:  సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

Related News

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

 ఎమ్మెల్యే కూతురితో ప్రేమ… తుపాకి మోతలతో రక్తపాతం… అమెజాన్ ప్రైమ్‌లో రచ్చ లేపుతున్న కొత్త క్రైమ్ సిరీస్

కాళీ శాపం… పాముకాట్లతో వరుస మరణాలు… మైండ్ బ్లాక్ చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా?

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

Big Stories

Advertisement
×