OTT Movie : సోషల్ ఇష్యూస్‌ని హైలైట్ చేస్తూ చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలు కొంతవరకైనా జనంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కరప్షన్‌పై వచ్చిన ఒక తమిళ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. ఈ సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్ మధ్య తమ్ముడు మిస్సింగ్ అవ్వడంతో, అక్క అతన్ని కాపాడేందుకు పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ వైబ్ ని ఇస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘కాఫీ’ 2022లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సాయి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని, ఓం సినీ వెంచర్స్ బ్యానర్‌పై సారథి సతీష్, ధర్శన్ కృష్ణ నిర్మించారు. ఇందులో ఇనియా, రాహుల్ దేవ్, ముగ్దా గోడ్సే, రామచంద్రన్ దురైరాజ్, సౌందర రాజా, ధరణి వాసుదేవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 నవంబర్ 27 కలర్స్ తమిళ్ టీవీలో డైరెక్ట్ టెలివిజన్ ప్రీమియర్‌గా రిలీజ్ అయింది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేశారు. 2024 సెప్టెంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో కూడా ఈ సినిమాని ఫ్రీగానే చూడొచ్చు. 1 గంట 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 4.7/10 రేటింగ్ పొందింది.
సత్య అనే అమ్మాయి, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, తన తమ్ముడు కార్తీక్‌ని పెంచుతూ ఉంటుంది. ఆమెకు పోలీస్ ఆఫీసర్ కావాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ సిట్యువేషన్స్ వల్ల క్యాబ్ డ్రైవర్‌గా వర్క్ చేస్తూ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంది. సత్య లైఫ్ సింపుల్‌గా, హోప్‌ఫుల్‌గా సాగుతుంటే, కార్తీక్‌కి ఒక జాబ్ దొరుకుతుంది. ఇక వీళ్ళకు ఫ్యూచర్ బ్రైట్ అనిపిస్తుంది. కానీ ఒక రోజు కార్తీక్ మిస్సింగ్ అవుతాడు. దీంతో సత్య లైఫ్ తలకిందులవుతుంది. ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, అక్కడ కరప్టెడ్ ఆఫీసర్స్ ఆమెకు హెల్ప్ చేయరు. హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్‌లో కార్తీక్ చిక్కుకున్నట్టు హింట్స్ దొరుకుతాయి. సత్య తన ఫ్రెండ్స్ సపోర్ట్‌తో కార్తీక్‌ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. సత్య క్యాబ్ డ్రైవ్ చేస్తూ క్లూ కోసం రాత్రంతా సిటీలో తిరుగుతుంది.
సత్య ట్రాఫికింగ్ రాకెట్‌లో డీప్‌గా వెళ్తుంది. డేంజరస్ గ్యాంగ్‌స్టర్స్‌తో ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో సత్య ఒక హిడెన్ ఆపరేషన్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె కార్తీక్‌ని రెస్క్యూ చేయడానికి ప్రాణాలు పణంగా పెడుతుంది. ఒక ఎమోషనల్ సీన్‌లో సత్య తన తమ్ముడి ఫోటో చూస్తూ ‘నీవు లేకపోతే నేను లేను’ అని ఏడుస్తుంది. ఇది ఆడియన్స్‌ని కదిలిస్తుంది. క్లైమాక్స్‌లో సత్య తన మిషన్‌లో సక్సెస్ అవుతుందా లేదా అనేది సస్పెన్స్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సస్పెన్స్ కు బ్రేక్ పడుతుందా ? సత్య తన తమ్ముడిని కనిపెడుతుందా ? కార్తీక్ మిస్సింగ్ వెనుక కారణం ఏమిటి ? అనే విషయాలను, ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్