BigTV English

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : సముద్రపు బీచ్ లకు సరదాగా సమయం గడపడానికి వెళ్తుంటాం. ఇందులో అలల మధ్యన సాయంత్రం వేళలో సర్ఫింగ్ చేస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాల్లో ఒక అమ్మాయి బీచ్ కి సర్ఫింగ్ కోసం వస్తుంది. అంతా బాగుందన్న సమయంలో ఒక సైకో ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. ఈ సైకో షార్క్ లను అభిమానిస్తుంటాడు. అంతేకాదు అమ్మాయిలను షార్క్ లకు ఆహారంగా వేస్తుంటాడు. ఈ అమ్మాయికి, ఆ సైకోకి జరిగే వార్ తో ఈ కథ తిరుగుతుంది. సర్వైవల్ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డేంజరస్ యానిమల్స్’ 2025లో విడుదలైన అమెరికన్-ఆస్ట్రేలియన్ సర్వైవల్ హారర్ ఫిల్మ్. సీన్ బైర్న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హాసీ హారిసన్, జై కోర్ట్‌నీ, జోష్ హ్యూస్టన్, ఎల్లా న్యూటన్, రాబ్ కార్ల్‌టన్, లియామ్ గ్రీన్‌కే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 17న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2025 జూన్ 6 అమెరికాలో షడ్డర్ ద్వారా, ఆస్ట్రేలియాలో జూన్ 12న కిస్మెట్ మూవీస్ ద్వారా రిలీజ్ అయింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

జెఫీర్ అనే అమెరికన్ అమ్మాయి, ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో సర్ఫింగ్ కోసం వస్తుంది. ఆమె ఒంటరిగా ఉండే టైప్. ఎవరితోనూ కలవకుండా, తన వ్యాన్‌లో జీవితాన్ని గడుపుతుంటుంది. ఒక రోజు ఆమె మోసెస్ అనే లోకల్ అబ్బాయిని కలుస్తుంది. వీళ్లిద్దరూ కాస్త రొమాన్స్ మొదలెడతారు. కానీ జెఫీర్ అతన్ని వదిలేసి, రాత్రి సర్ఫింగ్‌కి వెళ్తుంది. అక్కడ బ్రూస్ టకర్ అనే టూర్ గైడ్‌ని కలుస్తుంది, ఇతను టూరిస్ట్‌లను షార్క్ కేజ్ డైవింగ్‌కి తీసుకెళ్తాడు. కానీ టకర్ నిజంగా ఒక సీరియల్ కిల్లర్, షార్క్స్ మీద అబ్సెషన్ ఉన్న సైకో! అతను జెఫీర్‌ని కిడ్నాప్ చేసి, తన బోట్‌లో బంధిస్తాడు. ఆమెను షార్క్స్‌కి ఆహారంగా పెట్టే రిచ్వల్ ప్లాన్ చేస్తాడు. ఈ ఫస్ట్ హాఫ్‌లో, టకర్ క్రీపీ బిహేవియర్, జెఫీర్ ఒంటరితనం, ఆమె మోసెస్‌తో కలిసే సీన్స్ సినిమాని ఎంగేజింగ్‌గా ఉంచుతాయి.


సెకండ్ హాఫ్‌లో జెఫీర్ బోట్‌లో టకర్‌తో ఒక బ్యాటిల్ ఆఫ్ విట్స్‌లో ఉంటుంది. ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. బోట్‌లో చిన్న చిన్న ఆయుధాలు, టూల్స్ ఉపయోగించి, టకర్‌ని ట్రిక్ చేయడానికి ప్లాన్స్ వేస్తుంది. టకర్ మాత్రం తన షార్క్స్‌ని ప్యూర్ గా ఉంటాయని, మనుషులు కరప్ట్ అని చెప్పుకుంటూ, ఆమెను సైకలాజికల్‌గా టార్చర్ చేస్తాడు. ఒక సీన్‌లో టకర్ ఒక విచిత్రమైన డాన్స్ చేస్తూ, జెఫీర్‌ని టీజ్ చేసే సన్నివేశం చాలా క్రీపీగా ఉంటుంది. షార్క్స్ కొన్ని సీన్స్‌లో కనిపిస్తాయి, కానీ అసలు డేంజర్ టకర్ నుంచే వస్తుంది. జెఫీర్, టకర్‌తో ఫైట్ చేస్తూ సర్వైవ్ అవ్వడానికి ఫుల్ ఎఫర్ట్ పెడుతుంది. క్లైమాక్స్‌లో ఒకఊహించని ట్విస్ట్ తో ఈ స్టోరీ ముగుస్తుంది. టకర్‌ నుంచి జెఫీర్ బయటపడుతుందా ? షార్క్ లకు బలయ్యేది ఎవరు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

Related News

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

Big Stories

×