BigTV English

Venkatesh: నేను పాడుతాను , నాకో అవకాశం ఇవ్వండి

Venkatesh: నేను పాడుతాను , నాకో అవకాశం ఇవ్వండి

Venkatesh: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ టైటిల్ మాదిరిగానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి కెరియర్లో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంటర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు కళ్యాణ్ రామ్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో ఈ సినిమా మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లిపోయాడు అనిల్. ఈ తరుణంలో ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి సీక్వల్గా f3 సినిమాను కూడా తెరకెక్కించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వెంకటేష్ హీరోగా సినిమాను చేస్తున్నాడు అనిల్.


ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా భాస్కర్ భట్ల రచించిన గోదారి గట్టు పైన రామచిలక వే అనే పాట ఇక్కడ పెడితే అక్కడ మాత మోగిపోతుంది అని చెప్పాలి. దీనికి ముఖ్య కారణం చాలా సంవత్సరాలు తర్వాత రమణ గోగుల ఈ పాటను పాడటమే. ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ కూడా అద్భుతంగా అలరిస్తుంది. మొత్తానికి ఈ సినిమా నుంచి 3వ పాటను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ తరుణంలో ఏ సింగర్ తో ఈ పాటను పాటించాలి అనే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. అయితే నేను పాడుతాను అంటూ విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి వెనకాల తిరుగుతున్నట్లు ఒక వీడియోను అఫీషియల్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇదివరకే గురు అనే సినిమాలో వెంకటేష్ జింగిడి జింగిడి అనే పాటను పాడారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ పాట పాడేలా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అలా ప్లాన్ చేయడమే కాకుండా ఇలా కేవలం వెంకటేష్ అడుగుతున్నట్లు ఒక వీడియోను కూడా క్రియేట్ చేసి అద్భుతమైన ప్రమోషన్ స్ట్రాటజీ యూస్ చేశారు. ఇక రిలీజ్ చేసిన వీడియోలో స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్, స్వామియాజులను ఉద్యోగం అడిగినప్పుడు ఎటువంటి బ్యాగ్రౌండ్ స్కోర్ వినిపిస్తుందో సేమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అనిల్ వెనకాల వెంకటేష్ తిరుగుతున్నంతసేపు ప్లే చేశారు. మొత్తానికి వెంకటేష్ బాధపడలేక మ్యూజిక్ డైరెక్టర్ కి అనిల్ రావిపూడి ఫోన్ చేసి పాడించే అని విసిగిపోయి చెప్పినట్లు ఈ వీడియోని డిజైన్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read : Trivikram Srinivas: సీరియస్ టాపిక్ లో కూడా త్రివిక్రమ్ పంచ్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×