E-Paper
Advertisement

బిజినెస్‌లో బిగ్ ట్రబుల్… బావమరుదులు వేసిన ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాక్

బిజినెస్‌లో బిగ్ ట్రబుల్… బావమరుదులు వేసిన ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాక్
Advertisement

Comedy Series on OTT: కార్ రిపేర్ షాప్‌లో పని చేసే వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలే, పెద్ద కామెడీగా మారితే ఎలా ఉంటుంది? బిజినెస్‌ను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఒకడు తెగ ప్రయత్నిస్తుంటే… అతని పక్కనే ఉండే వ్యక్తి మాత్రం ప్రతి విషయాన్ని గందరగోళంగా మార్చేస్తుంటాడు. కస్టమర్లు, డబ్బు, బిజినెస్, కుటుంబం… వీటి మధ్య జరిగే రచ్చతో నవ్వులు పూయించే వర్క్‌ప్లేస్ కామెడీ సిరీస్ ‘టైర్స్ సీజన్ 3’ (Tires Season 3). మరి ఈ సీజన్‌లో ఏం జరుగుతుంది ? అసలు ఈ సిరీస్‌కు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ మొత్తం ‘వ్యాలీ ఫోర్జ్ ఆటోమోటివ్’ అనే కార్ టైర్స్ అండ్ రిపేర్ షాప్ చుట్టూ తిరుగుతుంది. బయటకు చూస్తే ఇది మామూలు ఆటో రిపేర్ బిజినెస్‌లాగే కనిపిస్తుంది. కానీ షాప్ లోపల అడుగుపెడితే మాత్రం అక్కడ జరిగే వ్యవహారాలు అసలు మామూలుగా ఉండవు. షాప్ మేనేజర్ విల్ తన తండ్రి ముందు తాను కూడా బిజినెస్‌ను విజయవంతంగా నడిపించగలనని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

Advertisement

విల్‌కు బిజినెస్‌ను అభివృద్ధి చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అక్కడే పని చేసే షేన్ అతనికి పెద్ద తలనొప్పిగా మారుతుంటాడు. షేన్ కూడా అదే షాప్‌లో పని చేస్తుంటాడు. కానీ బిజినెస్ ఎలా పెంచాలి, కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే విషయాల కంటే విల్‌ను ఆటపట్టించడం, కస్టమర్లతో వింతగా ప్రవర్తించడం, విచిత్రమైన ఆలోచనలతో షాప్‌లో గందరగోళం సృష్టించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాడు.

విల్ ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే షేన్ వల్ల మరో సమస్య మొదలవుతుంది. ఒక కస్టమర్‌ను సంతృప్తిపరచడానికి వేసిన ప్లాన్ చివరకు మరింత పెద్ద ఇబ్బందిగా మారుతుంది. షాప్‌కు ఎక్కువ బిజినెస్ తీసుకురావాలని అనుకున్న ప్రయత్నాలు ఊహించని కామెడీ పరిస్థితులకు దారితీస్తాయి. వీరిద్దరి మధ్య ఉండే విభిన్నమైన ఆలోచనా విధానమే సిరీస్‌లో ప్రధానమైన కామెడీకి కారణమవుతుంది.

Advertisement

సీజన్ 3లో కూడా ఇదే ఫార్ములాను మరింతగా ముందుకు తీసుకెళ్తూ, బిజినెస్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విల్ వేసే ప్లాన్స్, వాటిని షేన్ తనదైన పద్ధతిలో గందరగోళంగా మార్చడం, కస్టమర్లతో జరిగే వింత సంఘటనలు, షాప్ సిబ్బంది మధ్య ఉండే సిట్యుయేషనల్ కామెడీ ప్రధానంగా కనిపిస్తాయి. యాక్షన్ కంటే రొటీన్ జీవితంలో జరిగే చిన్న విషయాలను కామెడీగా మార్చడమే ఈ సిరీస్ ప్రత్యేకత.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

స్టాండప్ కమెడియన్ షేన్ గిల్లిస్ క్రియేట్ చేసిన ఈ వర్క్‌ప్లేస్ కామెడీలో షేన్ గిల్లిస్, స్టీవ్ బ్రూస్టర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘ది ఆఫీస్’, ‘బ్రూక్లిన్ నైన్-నైన్’ తరహా వర్క్‌ప్లేస్ కామెడీలను ఇష్టపడేవారికి ‘టైర్స్’ బెస్ట్ ఛాయిస్. సీజన్ 3 2026 మేలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఎపిసోడ్లు కూడా ఒక్కోటి సుమారు 20 నుంచి 25 నిమిషాల నిడివితో ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించకుండా వీకెండ్‌లో సరదాగా చూడవచ్చు. సీరియస్ డ్రామా కంటే ఫ్రెండ్స్‌తో కూర్చొని సరదాగా నవ్వుకోవాలనుకునేవారు ఈ సిరీస్ ను మస్ట్ ట్రై. అయితే ఈ సిరీస్ తెలుగులో మాత్రం లేదు.

Read Also: ఒక్క రాత్రి డేట్ అనుకున్నారు… కానీ కారు ఎక్కగానే నరకం మొదలైంది

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×