E-Paper
Advertisement

ఇన్‌స్టాలో పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేయడం ఎలా? సింపుల్ ట్రిక్స్!

ఇన్‌స్టాలో పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేయడం ఎలా? సింపుల్ ట్రిక్స్!
Advertisement

How to schedule posts on Instagram: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, సరైన సమయంలో పోస్ట్‌లు చేయడం కంటెంట్ క్రియేటర్లకు, బిజినెస్ ఓనర్లకు చాలా ముఖ్యం. రోజూ బిజీ షెడ్యూల్ కారణంగా అనుకున్న.. టైమ్‌కు పోస్ట్ చేయడం కుదరని వారికి ఇన్‌స్టా అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది. ఎలాంటి థర్డ్-పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. ఇన్‌స్టాగ్రామ్‌లోనే నేరుగా మీ పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈజీగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షెడ్యూలింగ్ ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

ఇన్‌స్టాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి కంటెంట్ క్వాలిటీ ఎంత ముఖ్యమో, పోస్ట్ చేసే టైమింగ్ కూడా అంతే ముఖ్యం. అయితే బిజీ ఉండే రోజుల్లో లేదా సెలవు దినాల్లో సరిగ్గా సమయానికి పోస్ట్ చేయడం చాలాసార్లు కుదరదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా ‘పోస్ట్ షెడ్యూలింగ్’ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా మీ ఫోటోలు, రీల్స్‌ను ముందే ప్లాన్ చేసి, నిర్దిష్టమైన తేదీ, సమయంలో ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ఎలా చేయాలి ?:

Advertisement

ఈ ఫీచర్‌ను వాడటానికి మీ అకౌంట్ సాధారణ వ్యక్తిగత ప్రొఫైల్ కాకుండా.. క్రియేటర్  లేదా బిజినెస్ అకౌంట్ అయి ఉండాలి. ఇది పూర్తిగా ఫ్రీ, ఎలాంటి అదనపు యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.

స్టెప్-బై-స్టెప్ షెడ్యూలింగ్ ప్రాసెస్:

Advertisement

1.యాప్ ఓపెన్ చేయండి: మీ ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేసి, కొత్త పోస్ట్ లేదా రీల్ క్రియేట్ చేయడానికి ‘+’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

2.కంటెంట్ సెలెక్ట్ చేయండి: మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫోటో, వీడియో లేదా రీల్‌ను ఎంచుకుని, మీకు నచ్చిన ఫిల్టర్లు లేదా ఎడిటింగ్ చేయండి.

3.అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్: క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చిన తర్వాత చివరి పేజీకి వెళ్లండి. అక్కడ కింద కనిపించే ‘అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్’ (Advanced Settings) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4.షెడ్యూల్ ఆప్షన్ ఎనేబుల్ : అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో మీకు ‘Schedule this post’ లేదా ‘Schedule this reel’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని టోగుల్ చేసి ఆన్ చేయండి.

5.తేదీ, టైం సెట్ చేయండి: మీ పోస్ట్ ఎప్పుడు లైవ్‌లోకి రావాలనుకుంటున్నారో.. ఆ సరైన తేదీ , టైం సెలెక్ట్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు ప్రస్తుత సమయం కంటే కనీసం 20 నిమిషాల నుంచి గరిష్టంగా 75 రోజుల వరకు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు.

6.ఫైనల్లీ షెడ్యూల్ : అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత పైన కనిపించే ‘Schedule’ బటన్ పై క్లిక్ చేయండి. అంతే.. మీ పోస్ట్ సెట్ చేసిన సమయానికి ఆటోమేటిక్‌గా పబ్లిష్ అవుతుంది.

Also Read: ఫిలిప్స్ Vs హయర్ ఎయిర్ ఫ్రైయర్స్..ఇండియన్ వంటలకు ఏది బెస్ట్?

మెటా బిజినెస్ సూట్ :

మొబైల్ యాప్‌తో పాటు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ వాడేవారు ‘మెటా బిజినెస్ సూట్’ (Meta Business Suite) లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా కూడా ఒకేసారి అనేక పోస్టులను ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకోవచ్చు.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌ను చాలా ఈజీ చేసే ఈ షెడ్యూలింగ్ ఫీచర్ కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. రోజూ పోస్ట్ పెట్టే.. టెన్షన్ లేకుండా, వీకెండ్‌లోనే ఒక వారం సరి పడా కంటెంట్‌ను ముందే షెడ్యూల్ చేసుకొని మీ సమయాన్ని ఆదా చేసుకోండి!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×