Maruti Suzuki Cars Price Hike: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకి.. కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. అరేనా, నెక్సా షోరూమ్ లలో అమ్మే పలు కార్ల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు మారుతూ ఉండగా, గరిష్టంగా రూ.30,000 వరకు ధర పెరిగింది. హ్యాచ్ బ్యాక్ లు, సెడాన్ లు, ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలతో పాటు ఎలక్ట్రిక్ కార్ల ధరలనూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ధరల పెంపులో మారుతి బాలెనోపై ఎక్కువ ప్రభావం పడింది. ఎంపిక చేసిన వేరియంట్ ను బట్టి బాలెనో ధర గరిష్టంగా రూ.30,000 వరకు పెరిగింది. దీంతో ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కొనుగోలు చేయాలనుకునే వారికి గతంతో పోలిస్తే మరింత భారం కానుంది. మారుతి కొత్తగా తీసుకొచ్చిన ఇ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరను కూడా రూ.20,000 వరకు పెంచింది. జిమ్నీపై రూ.15,000 వరకు, విక్టోరిస్, ఇన్విక్టో మోడళ్లపై రూ.10,000 వరకు ధర పెరిగింది.
ఎంట్రీ లెవల్ కార్ల విషయానికి వస్తే, ధరల పెంపు కొంత తక్కువగానే ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ఆర్ వంటి మోడళ్ల ధరలు రూ.2,500 వరకు పెరిగాయి. క్యారీ మోడల్‌పై కూడా రూ.2,500 వరకు పెంపు ఉంది. స్విఫ్ట్, ఈకో మోడళ్ల ధరలు రూ.5,000 చొప్పున పెరిగాయి. డిజైర్, టూర్ S, ఎర్టిగా, XL6 మోడళ్ల ధరలు వేరియంట్‌ను బట్టి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు పెరిగాయి.
SUVల విషయానికి వస్తే బ్రెజ్జా, గ్రాండ్ విటారా ధరలు రూ.5,000 వరకు పెరిగాయి. ఫ్రాంక్స్ ధర గరిష్టంగా రూ.7,500 వరకు పెరిగింది. దీంతో మారుతి అరేనా, నెక్సా రెండు విక్రయ నెట్ వర్క్ లలోనూ ధరల మార్పు కనిపిస్తోంది. కంపెనీకి చెందిన దాదాపు అన్ని విభాగాల్లో ధరలను సవరించింది.
ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ఆర్, క్యారీ మోడళ్లపై రూ.2,500 వరకు పెంచింది. స్విఫ్ట్, ఈకోపై రూ.5,000 చొప్పున పెరిగింది. డిజైర్, టూర్ S, ఎర్టిగా, XL6పై రూ.5,000 నుంచి రూ.7,500 వరకు పెరిగింది. బ్రెజ్జా, గ్రాండ్ విటారా రూ.5,000 వరకు పెరగగా, ఫ్రాంక్స్ రూ.7,500 వరకు పెరిగింది. విక్టోరిస్, ఇన్విక్టో రూ.10,000 వరకు, జిమ్నీ రూ.15,000 వరకు, ఇ-విటారా రూ.20,000 వరకు పెరిగాయి. బాలెనో మాత్రం గరిష్టంగా రూ.30,000 పెరిగింది.
ఇటీవల వాహన తయారీ సంస్థలు ఉత్పత్తి వ్యయాలు, ఇతర మార్కెట్ పరిస్థితుల కారణంగా కార్ల ధరలను పెంచడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి కూడా తాజా ధరల మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read Also: కొత్త లుక్‌లో పల్సర్ 125, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!