E-Paper
Advertisement

ఒక్క రాత్రి డేట్ అనుకున్నారు… కానీ కారు ఎక్కగానే నరకం మొదలైంది

ఒక్క రాత్రి డేట్ అనుకున్నారు… కానీ కారు ఎక్కగానే నరకం మొదలైంది
Advertisement

Dark Comedy Thriller: ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అనుకోకుండా శవం ఉన్న కారు, భారీ మొత్తంలో డబ్బు దొరికితే ? పోలీసులకు చెబితే తమకే సమస్యలు వస్తాయని భయపడి ఆ శవాన్ని దాచేస్తే ? అక్కడితో కథ ముగిసిపోదు… అసలు ఆ కారు ఎవరిది? ఆ శవం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? తమకు తెలియకుండానే ఓ సైకో కిల్లర్‌ ఆటలోకి అడుగు పెట్టిన ఆ ఇద్దరూ చివరకు ఎలా బయటపడ్డారు ? ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆల్ నైట్ రాంగ్’ (All Night Wrong). మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

గ్యారీ (జాక్ చెర్రీ) ఇప్పటికే పెళ్లయిన వ్యక్తే అయినప్పటికీ… పెద్దగా ధైర్యం లేని మనిషి. మరోవైపు ఎల్ (మరియా బకలోవా) తన భర్తను కోల్పోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. వీరిద్దరికీ ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ఒక బ్లైండ్ డేట్‌కి దారితీస్తుంది. సాధారణంగా కొన్ని గంటల్లో ముగిసిపోయే డేట్‌గా మొదలైన ఈ పరిచయం… ఊహించని పరిణామాలతో ఒక రాత్రంతా సాగే ప్రమాదకరమైన ప్రయాణంగా మారుతుంది.

Advertisement

గ్యారీ, ఎల్ కలుసుకున్న తర్వాత పరిస్థితులు అనుకోని విధంగా మారిపోతాయి. ఓ దశలో వీరిద్దరూ కలిసి ఒక కారును తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కారు తమకు పెద్ద సమస్యగా మారుతుందని వాళ్లిద్దరూ ఊహించరు. కానీ కాసేపటి తర్వాత ఆ కారు డిక్కీలో ఉన్న వస్తువులు చూసి షాక్ అవుతారు. డిక్కీలో ఒక శవం ఉంటుంది. దానికి తోడు దాదాపు 40 వేల డాలర్ల నగదు ఉన్న బ్యాగ్ కూడా కనిపిస్తుంది. తాము కారు దొంగిలించామని పోలీసులకు తెలిస్తే ఒక సమస్య… ఇప్పుడు కారులో శవం ఉందని చెబితే మరో పెద్ద సమస్య. పైగా ఆ కారు ఓ ప్రమాదకరమైన కిల్లర్‌కు సంబంధించినదని వారికి తెలియడంతో భయం మరింత పెరుగుతుంది.

పోలీసులకు సమాచారం ఇవ్వడం కంటే శవాన్ని దాచేస్తే తమ సమస్య తీరిపోతుందని గ్యారీ, ఎల్ అనుకుంటారు. ‘శవం లేకపోతే నేరం లేదు’ అనే ఆలోచనతో దాన్ని ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టాలని నిర్ణయించుకుంటారు. కానీ ఒకసారి ఆ తప్పు నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులు వాళ్ల చేతుల్లో ఉండవు. శవాన్ని దాచే ప్రయత్నంలో వారికి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొన్ని కీలకమైన వస్తువులు దొరుకుతాయి. అందులోని మెమొరీ కార్డ్ ద్వారా అతడి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడతాయి. చనిపోయే ముందు అతను తన ప్రియురాలికి ఒక చివరి సందేశాన్ని చేరవేయాలని కోరుకున్నాడనే విషయం గ్యారీ, ఎల్‌కు తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే ఒక నేరంలో చిక్కుకున్న ఈ ఇద్దరూ… ఆ చివరి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకోవడం మరో కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఆ సందేశాన్ని అందించడానికి ప్రయత్నించే క్రమంలో వాళ్లు రాత్రంతా నగరంలో తిరగాల్సి వస్తుంది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ కొత్త చిక్కులు ఎదురవుతాయి. తాము చేసిన చిన్న తప్పులు మరిన్ని తప్పులకు దారితీస్తాయి. మరోవైపు అసలు ప్రమాదం మాత్రం వాళ్లను వెతుక్కుంటూ వస్తుంటుంది. కారుకు, శవానికి, డబ్బుకు సంబంధించిన అసలు వ్యక్తులు ఎవరు ? గ్యారీ, ఎల్ ఎందుకు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు ? చనిపోయిన వ్యక్తి చివరి కోరికను నెరవేర్చడానికి వాళ్లు చేసిన ప్రయత్నం ఎక్కడికి దారితీసింది ? చివరకు అసలు కిల్లర్‌కు వీళ్ల ఆచూకీ ఎలా తెలిసింది? శవం, డబ్బు వెనుక అసలు కథ ఏంటి? ఆ రాత్రంతా సాగిన పరుగు తర్వాత గ్యారీ, ఎల్ ప్రాణాలతో బయటపడ్డారా? చనిపోయిన వ్యక్తి చివరి కోరిక నెరవేరిందా? అనేది ‘ఆల్ నైట్ రాంగ్’లో చూడాల్సిన అసలు విషయం.

తెలుగులో ఉందా ?

ఒక సాధారణ బ్లైండ్ డేట్‌ నుంచి మొదలైన కథ.. క్రమంగా క్రైమ్, బ్లాక్ హ్యూమర్, సస్పెన్స్, సర్వైవల్ కలిసిన విచిత్రమైన రాత్రిగా మారుతుంది. ముఖ్యంగా గ్యారీ, ఎల్ ఇద్దరూ ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాకపోవడంతో… ప్రతి సమస్యను వాళ్లు పరిష్కరించే ప్రయత్నం మరో సమస్యకు దారి తీస్తుంది. ఇదే సినిమాలో కామెడీకి కూడా ప్రధాన కారణంగా నిలుస్తుంది. మరియా బకలోవా (Maria Bakalova), జాక్ చెర్రీ (Jack Cherry) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేసన్ జేమ్స్ (Jason James) దర్శకత్వం వహించారు. టైలర్ లాబైన్, ఎమిలీ హాంప్‌షైర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఆల్ నైట్ రాంగ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు.

Read Also: ఫేస్ ఇంటర్నేషనల్ స్టార్ లా ఉందని జీవితమే నరకం చేశారు… సమాజం చేసిన పనికి దిమ్మతిరిగిపోతుంది

Related News

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

Big Stories

Advertisement
×